థాయ్‌లాండ్ ఎన్నికల్లో ఏకపక్ష విజయమే ఖాయమైంది. 93 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. అధికార జున్టా పార్టీనే ముందంజలో ఉంది. ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా 75 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని థాయ్ ఎన్నికల సంఘం ప్రకటించింది.
2014 సైనిక తిరుగుబాటు తర్వాత థాయ్‌లాండ్‌లో జరిగిన మొదటి ఎన్నికలు ఇవే. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ప్రయూత్ వైపే అక్కడి ప్రజలు మొగ్గు చూపుతున్నారని స్పష్టమైంది.
మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
ఇదీ చూడండి:ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేస్తున్న థాయ్‌లాండ్