ETV Bharat / international

పాదాలతోనే అద్భుత చిత్రాలు.. దివ్యాంగుడి ప్రతిభ - రష్యా వార్తలు

పనులు అందరూ చేస్తారు. కానీ అద్భుతాలు కొందరే చేస్తారు. ఆ కొందరిలో ఒకరయ్యారు రష్యాకు చెందిన ఓ దివ్యాంగుడు. అద్భుతాలను అవయవాలతో మాత్రమే కాదు.. ఆత్మ విశ్వాసంతోనూ చేయవచ్చని నిరూపిస్తున్నారు. రెండు చేతులూ సక్రమంగా లేకున్నా పాదాలతోనే ఆకట్టుకునే చిత్రాలు గీస్తున్నారు. కష్టాలు ఎదురైతే కుంగిపోయే వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

disabled artist from russia, రష్యన్​ దివ్యాంగుడి ప్రతిభ
పాదాలతోనే అద్భుత చిత్రాలు.. రష్యా దివ్యాంగుడి ప్రతిభ
author img

By

Published : Jun 28, 2021, 2:08 PM IST

ఆదర్శంగా నిలుస్తున్న రష్యన్​ చిత్రకారుడు

అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే సంకల్పం ఉండాలి. ఎదురుగా కొండంత కష్టం ఉన్నా తట్టుకునే ఆత్మ నిబ్బరం కావాలి. ఈ గొప్ప లక్షణాలతో ఔరా అనిపించే అద్భుతమే చేస్తున్నారు.. రష్యాకు చెందిన ఓ దివ్యాంగుడు. చేతులు సక్రమంగా లేకున్నా పాదాలతోనే చిత్రాలు గీస్తూ భళా అనిపిస్తున్నారు రష్యాకు చెందిన ఫియోడార్ సుడార్కికోవ్స్. పుట్టుకతోనే వైకల్యం ఉన్నా ఈ కష్టాన్నేమీ లెక్క చేయకుండా చిత్రలేఖనం సాధన చేసి కఠినమైన చిత్రాలను సైతం పాదాలతో అలవోకగా గీయడం ఫియోడార్​ ప్రత్యేకత.

గత కొన్ని సంవత్సరాలుగా చిత్రాలను వేస్తున్న ఆయన.. వాటిని ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. ఇప్పటివరకు తాను వేసిన చిత్రాలను ప్రదర్శించటం, అమ్మటం చేయని ఫియోడర్.. తొలిసారి తన కళాఖండాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. సెయింట్ పీటర్స్​బర్గ్​లోని లిఖాచెవ్​ లైబ్రరీలో ఫియోడార్​ తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ చిత్రాలను చూసిన సందర్శకులు ఫియోడార్​ ప్రతిభకు ఆశ్చర్యపోతున్నారు.

అంగవైకల్యం కారణంగా బాల్యం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఫియోడార్​.. కష్టాల నుంచి మరింత రాటుదేలారు. చిన్నప్పుడు అనాథ శరణాలయంలో పెరిగిన ఫియోడార్.. మీకోసం మీరే నిలబడాలి అన్న ఉపాధ్యాయుల మాటలతో గట్టిగా సంకల్ప బలాన్ని అలవర్చుకున్నారు. అదే ఆయనను గొప్ప చిత్రకారుడిగా మార్చాయి. తాను వేసిన చిత్రాలకు సందర్శకుల నుంచి విశేష స్పందన రావడంపై ఫియోడార్​ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన కంటే సంతోషవంతులు ప్రపంచంలో ఎవరూ ఉండరని ఆనందంతో చెబుతున్నారు.

ఇదీ చదవండి : అంతరిక్షం అంచుకు వెళ్లాలా? ఎంత ఖర్చవుతుందంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.