ETV Bharat / international

వియత్నాంలో వరద బీభత్సం- 90మంది మృతి

వియత్నాంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరద ధాటికి 90మంది మృతి చెందారు. మరో 34 మంది గల్లంతయ్యారు. లక్షమందికిపైగా ప్రభావితమయ్యారు.

90 dead, 34 missing in Vietnam floods, landslides
వియత్నాంలో వరదల బీభత్సం- 90మంది మృతి
author img

By

Published : Oct 19, 2020, 2:46 PM IST

వియత్నాంలో గడిచిన రెండు వారాలుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్వాంగ్​ త్రీ, తువా థియాన్​హ్యూ, క్వాంగ్​నామ్​ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడి 90 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 34మంది గల్లంతయ్యారు.

లక్షమందికి పైగా ప్రభావితం..

వరద ప్రభావిత ప్రాంతాల్లోని 37,500 ఇళ్లల్లో లక్షా 21 వేల మందికిపైగా ఖాళీ చేయించారు అక్కడి విపత్తు నిర్వహణ అధికారులు. మౌలిక సదుపాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. విద్యుత్​ సరఫరా నిలిచిపోయి.. కొన్ని ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి.

లక్షలాది మూగజీవులు బలి

వరదల కారణంగా 5 లక్షల 31 వేల 800 మూగజీవులు చనిపోయాయని అక్కడి అధికారులు తెలిపారు.

ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అధికారులు... రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: మరో అరబ్​ దేశంతో ఇజ్రాయెల్​ 'దోస్తీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.