ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో నెత్తుటి మరకలు చిందాయి. ఉదయం 6 బాంబు దాడులతో కుదేలయిన శ్రీలంక దేశంలో మరో రెండు పేలుళ్లు జరిగాయి. తాజా దాడుల్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 8వ పేలుడు... ఆత్మాహుతి దాడని పోలీసులు చెప్పారు.
ఈరోజు శ్రీలంకలో మొత్తం 8 బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో 165మంది మరణించారు. 450 మందికిపైగా గాయపడ్డారు.
తాజా పరిస్థితితో శ్రీలంక ప్రజలు భీతిల్లిపోతున్నారు. ఎక్కడ, ఎప్పుడు బాంబు పేలుతుందో తెలియక... భయానక వాతావరణంలో బతుకుతున్నారు.
ప్రజలు బయటకు రావాలంటే హడలిపోతున్నారు. ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నా మరో రెండు పేలుళ్లు సంభవించడం అయోమయంలో పడేసింది.
వరుస పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తోంది. ముందు జాగ్రత్తగా రాత్రి వేళ కర్ఫ్యూ, సామాజిక మాధ్యమాలపై తాత్కాలిక నిషేధం విధించింది.
ఇదీ చూడండి: ఉగ్రదాడిపై 10 రోజుల ముందే సమాచారం..!