ETV Bharat / international

అఫ్గాన్​ బలగాల దాడుల్లో 70మంది తాలిబన్లు హతం!

author img

By

Published : Nov 16, 2020, 4:31 PM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల మారణహోమాలకు ప్రతిస్పందనగా ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టాయి భద్రతా దళాలు. గత నెల రోజుల్లో హెల్మండ్​, కందహార్​ రాష్ట్రల్లోనే 70 మంది తాలిబన్​ కంమాండర్లు హతమైనట్లు తాజాగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అలాగే హెల్మండ్​లో మరో 152 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపింది.

Taliban commanders killed
తాలిబన్​ కంమాండర్లు హతం

అఫ్గానిస్థాన్​లో కొద్ది రోజులుగా తాలిబన్లు చేస్తోన్న దాడులకు ప్రతిస్పందనగా ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టాయి భద్రత దళాలు. గత నెల రోజుల్లో హెల్మండ్​, కందహార్​ రాష్ట్రాల్లో బలగాలు చేపట్టిన దాడుల్లో మొత్తం 70 మంది తాలిబన్​ కమాండర్లు హతమయ్యారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.

ఈ ఆపరేషన్​లో భాగంగా హెల్మండ్​ రాష్ట్రంలో మరో 152 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తరీక్​ అరియన్​. బలగాల కాల్పుల్లో హతమైన తాలిబన్లలో 20 మంది హెల్మండ్​లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా పేర్కొన్నారు.

" కందహార్​లో హతమైన తాలిబన్​ కమాండర్లలో 10 మంది ఉరుజ్గాన్​, కందహార్​, ఘజ్నీ నుంచి వచ్చారు. కందహార్​లో మొత్తం 40 మంది కమాండ్లరు హతమయ్యారు. హెల్మండ్​ దాడుల్లో సుమారు 30 మంది తాలిబన్​ కమాండర్లు గాయపడ్డారు. "

- తరీక్​ అరియన్​, అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి.

తాలిబన్​ దాడులకు ప్రతిస్పందనగా హెల్మండ్​, కందహార్​ సహా ఇతర దక్షిణ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టినట్లు చెప్పారు తరీక్​ అరియన్​. ఇప్పటికీ దక్షిణ రాష్ట్రాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయని తెలిపారు. గడిచిన 25 రోజుల్లో తాలిబన్లు చేపట్టిన దాడుల్లో మొత్తం 134 మంది పౌరులు మరణించగా, మరో 289 మంది తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:అఫ్గానిస్థాన్​లో ఉగ్రదాడి- ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.