ఇండోనేషియాను భూకంపాలు మరోసారి వణికించాయి. తూర్పు ఇండోనేషియాలో నేడు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3గా తీవ్రత నమోదైనట్లు అమెరికా భూకంప శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు.
బందా సముద్రం తీరంలోని అమ్బొన్ ద్వీపానికి దక్షిణాన సుమారు 208 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించాారు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశాలు లేవని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
పపువాలోనూ..
పపువా రాష్ట్రంలోని అబెపురా నగరానికి 240 కిలోమీటర్ల దూరంలో సుమారు 21 కిలోమీటర్ల లోతుతో భూకంపం వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బంగ్లాలో రైలు ప్రమాదం: నలుగురు మృతి