భారత్‌లో కలకలం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలైంది. ప్రపంచవ్యాప్తంగా 2018 వరకు మరణ దండన ఎదుర్కొన్న వారి సంఖ్యను వెల్లడించింది అమెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ. 2018 చివరి నాటికి అంతర్జాతీయంగా 19,336 మందిని ఉరితీసినట్లు తెలిపింది. ఒక్క 2018లోనే 690 మందికి మరణశిక్షను అమలు చేసినట్లు పేర్కొంది. ఈ మరణ దండనలను అమెరికా, చైనా, ఇరాన్, సౌదీ, సింగపూర్‌తో సహా మొత్తం 20 దేశాలు అమలు చేసినట్లు పేర్కొంది.
2018 చివరలో మొత్తం 148 దేశాలు మరణశిక్షను రద్దు చేసినట్లు తెలిపింది అమెస్టీ. అదే ఏడాది మరణశిక్షను క్షమాభిక్షగా మార్చిన 29 దేశాల్లో భారత్ కూడా ఉందని వివరించింది.
2017లో అంతర్జాతీయంగా 993 మరణశిక్షలు అమలు చేసినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం నివేదిక చెబుతోంది. ఆ ఏడాదితో పోలిస్తే 2018లో 31 శాతం తక్కువ మరణ శిక్షలు అమలైనట్లు అమెస్టీ పేర్కొంది. ఎక్కువగా చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, వియత్నం, ఇరాక్ దేశాల్లోనే ఎక్కువ మరణశిక్షలు విధించినట్లు స్పష్టం చేసింది.
2018లో వియత్నంలో అత్యధికంగా 85 మరణశిక్షలు అమలు చేశారు. మొదటి ఐదు మరణ దండనలను ఇక్కడే జరిగనట్లు అమెస్టీ పేర్కొంది. అంతేకాకుండా ఇరాన్, సౌదీ అరేబియా, వియత్నం, ఇరాక్ దేశాల్లో కలిసి 75 శాతం డెత్ వారెంట్లను జారీ చేసినట్లు తెలిపింది.
సౌదీలో 2017లో 93 మరణశిక్షలు అమలు చేయగా.. 2018లో 136 మందిని ఉరి తీసినట్లు వివరించింది. పాకిస్థాన్‌లో 2017లో 60 మరణ దండనలను అమలు చేయగా.. 2018లో 77 శాతం పడిపోయాయి.
ఇదీ చదవండి:ఉరికి ముందు తిహార్ జైలు ఎస్పీకి నిర్భయ దోషి గిఫ్ట్!