ETV Bharat / international

ఉగ్రవాదంపై పాక్​ కీలక ప్రకటన.. అందుకేనా? - ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం

నాలుగేళ్లలో పాకిస్థాన్ 3లక్షల 75 వేల ఉగ్రవాత నిరోధక ఆపరేషన్లు చేసినట్లు ఆ దేశ ఆర్మీ తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్​ పెట్టినట్లు చెప్పుకొచ్చింది. ఈ ప్రకటనతో ఎఫ్​ఏటీఎఫ్​ గ్రే లిస్టు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

375,000 anti-terror operations conducted in last four years: Pak Army
'నాలుగేళ్లలో 3లక్షలకు పైగా యాంటి టెర్రర్​ ఆపరేషన్​లు'
author img

By

Published : Feb 22, 2021, 11:34 PM IST

పాకిస్థాన్​లో ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా ఇప్పటివరకు 3 లక్షల 75 వేల యాంటి టెర్రర్​ ఆపరేషన్లు చేసినట్లు పాక్​ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఈ కార్యకలాపాలు అన్నీ కేవలం నాలుగేళ్లలో చేసినట్లు తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలపై నిఘావేసి.. వాటిని అంతమోందించినట్లు పేర్కొంది. 'రాద్​-ఉల్​-ఫసద్​' అనే ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం నాలుగేళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో ఆర్మీ ప్రతినిధి మేజర్​ జనరల్​ బాబర్​ ఇఫ్తీఖర్​ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్​ ఇప్పటి వరకు పోరాటం చేసిందన్నారు. తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అంతం చేసే దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్​ఏటీఎఫ్​) ప్లీనరీ సమావేశానికి ముందుగా పాకిస్థాన్​ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2018 జూన్​లో పారిస్​లో నిర్వహించిన ఎఫ్​ఏటీఎఫ్​ సమావేశంలో పాకిస్థాన్‌ను 'గ్రే' లిస్ట్​లో చేర్చింది. త్వరలో జరగబోయే ఎఫ్​ఏటీఎఫ్ సమావేశంలో క్రోడీకరించిన 27 అంశాలపై పాక్​ అనుసరించే విధానంపై సమీక్ష జరుగుతుంది. అనంతరం పాక్​ని గ్రే లిస్ట్​లో ఉంచాలా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది.

"రాద్​-ఉల్​-ఫసద్​ ముఖ్య ఉద్దేశం ఉగ్రవాదాన్ని అంతం చేయడం. శాంతియుత, స్థిరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించి వారి విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. అంతేగాక ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవాలి. ఇందులో భాగంగానే 3 లక్షల 75 వేల యాంటి టెర్రర్​ ఆపరేషన్లు చేశాం. ఈక్రమంలో 72 వేలు విదేశీ ఆయుధాలు, 50 లక్షల రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. సుమారు 5 వేల మందికి పైగా హెచ్చరికలు జారీ చేశాం. 2017-2021 మధ్య కాలంలో 1,850 సార్లు టెర్రర్​ అటాక్​లు జరిగాయి. ఇప్పటివరకు పాక్​-అఫ్గాన్​ సరిహద్దుల్లో1,684 సార్లు కాల్పులు చోటు చేసుకున్నాయి."

- మేజర్​ జనరల్​ బాబర్​ ఇఫ్తీఖర్​, ఆర్మీ ప్రతినిధి

ఇదీ చూడండి:గ్రే లిస్ట్​లోనే పాక్- వచ్చే ఏడాది బ్లాక్​ లిస్ట్​లో చేరిక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.