అఫ్గానిస్థాన్లో దారుణం జరిగింది. పశ్చిమ ఫరా రాష్ట్రంలోని కాందహార్-హెరాత్ జాతీయ రహదారిపై బుధవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
భద్రతా దళాలు, పోలీసులే లక్ష్యంగా చేసిన దాడిలో సామాన్యులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మరణించినవారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఈ దాడికి ఇప్పటివరకూ ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. తాలిబన్ ఉగ్రవాద సంస్థే కారణమై ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.