ETV Bharat / international

'2,050 సార్లు.. 21 మంది మృతి.. కవ్విస్తున్న పాక్'

సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,050 సార్లు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

'2,050 సార్లు.. 21 మంది మృతి.. కవ్విస్తున్న పాక్'
author img

By

Published : Sep 15, 2019, 4:24 PM IST

Updated : Sep 30, 2019, 5:28 PM IST

'2,050 సార్లు.. 21 మంది మృతి.. కవ్విస్తున్న పాక్'

భారత సరిహద్దులో పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పాక్ దుశ్చర్యలకు ఈ ఏడాది సుమారు 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 2,050 సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడి.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పదేపదే ఉల్లంఘించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

"పౌరులు, సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం, ఉగ్రవాదుల చొరబాటు, కవ్వింపు చర్యలపై ఆ దేశం వద్ద ఆందోళన వ్యక్తం చేశాం. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి సరిహద్దులు, నియంత్రణ రేఖ వద్ద శాంతి, సామరస్యాన్ని పాటించాలని పాకిస్థాన్‌కు ఎప్పటికప్పుడు సూచిస్తున్నాం."

-రవీశ్​ కుమార్​, విదేశాంగ శాఖ ప్రతినిధి.

పాకిస్థాన్​ దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ.. మన బలగాలు చాలా సంయమనం పాటిస్తున్నాయని తెలిపారు రవీశ్​ కుమార్​. పాక్‌ కవ్వింపు చర్యలు, ఉగ్రవాదుల చొరబాటుకు దీటుగా బదులిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: తమిళనాడులో మరో 'ఇడ్లీ బామ్మ'.. పేదలకు ఉచితం

Intro:Body:

;

Conclusion:
Last Updated : Sep 30, 2019, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.