అఫ్గానిస్థాన్‌పై తాలిబన్లు చేసిన దాడుల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. నిమ్రోజ్ రాష్ట్రంలోని ఖాష్రోద్ జిల్లాలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు వెల్లడించారు.
ఈ ఘటనలో మరో ఆరుగురు సిబ్బందిని.. తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారని నిమ్రోజ్ గవర్నర్ జలీల్ అహ్మద్ వాటన్దస్త్ తెలిపారు. అయితే.. ఈ అంశంపై ఆ దేశ రక్షణ శాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
దోహాలో తాలిబన్లతో శాంతికోసం చర్చలు కొనసాగుతున్న తరుణంలోనే ఇలాంటి హింసాత్మక దాడులు జరగడం గమనార్హం.
తాజా దాడితో 24 గంటల వ్యవధిలోనే 24 రాష్ట్రాలపై తాలిబన్లు దాడిచేశారని అఫ్గాన్ ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్‌కు గిన్నిస్ రికార్డు