ETV Bharat / international

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా అణ్వాయుధ నౌకలు - దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకలు

దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతుగా అమెరికా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద జలాల్లో అణ్వాయుధ విమాన వాహక నౌకలను మోహరించి సైనిక విన్యాసాలను ప్రదర్శించాయి. ఈ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది.

South China Sea
అమెరికా అణ్వాయుధ నౌకలు
author img

By

Published : Jul 4, 2020, 10:20 AM IST

వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి రెండు విమాన వాహక నౌకలను పంపింది అమెరికా. చైనా తనదిగా చెబుతున్న ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేశాయి అమెరికా బలగాలు. హిందూ- పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతుగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా నావికాదళం స్పష్టం చేసింది.

South China Sea
అమెరికా అణ్వాయుధ నౌకలు

ఈ మేరకు దక్షిణ చైనా సముద్రంలోకి యూఎస్​ఎస్ రోనాల్డ్ రీగన్, యూఎస్​ఎస్​ నిమిట్జ్ నౌకలను పంపినట్లు తెలిపింది. వీటికి అనుసంధానంగా విమానాల సామర్థ్యాన్ని 24 గంటలు పర్యవేక్షించే 4 యుద్ధనౌకలు ఉంటాయి. చైనా కూడా ఇదే ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేపడుతోంది. అమెరికా, చైనా రెండు దేశాలు ఇలా చేయటం ఇదే మొదటిసారి.

South China Sea
అమెరికా అణ్వాయుధ నౌకలు

"అంతర్జాతీయ చట్టాలు అనుమతించిన చోట అన్ని దేశాలు ప్రయాణ, రవాణా హక్కులకు మద్దతుగా నిలవడానికి అమెరికా కట్టుబడి ఉందని చెప్పేందుకే ఈ ప్రయత్నం. ఈ ప్రాంతంలో నౌకల బృందాలకు శిక్షణతోపాటు పనిచేయడానికి ఈ అవకాశం కల్పించాం. ఫలితంగా కమాండర్లకు ఇక్కడి పరిస్థితులపై అవగాహన పెరుగుతుంది. అమెరికా నేవీ సామర్థ్యాలను ఇది మెరుగుపరుస్తుంది."

- లెఫ్టినెంట్ సీన్​ బ్రోఫీ, రోనాల్డ్ రీగన్​ నౌకా బృందం

చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకే..

South China Sea
అమెరికా అణ్వాయుధ నౌకలు

ఈ విన్యాసాలకు సంబంధించి దీర్ఘకాలంగా ప్రణాళికలు వేస్తున్నామని వెల్లడించింది అమెరికా. అయితే పారాసెల్​ దీవుల్లో చైనా విన్యాసాలు చేయటంపై ఇతర దేశాలు విమర్శించిన నేపథ్యంలో ముందడుగు వేశామని స్పష్టం చేసింది. వివాదాస్పద జలాల్లో చైనా దుందుడుకు చర్యలకు దిగుతోందని అమెరికా రక్షణ శాఖ కూడా గురువారం ప్రకటించింది.

  • America agrees with  our Southeast Asian friends:  The PRC’s military exercise in disputed waters of the South China Sea is highly provocative. We oppose Beijing’s unlawful claims. Period. https://t.co/i6TRac2WuJ

    — Secretary Pompeo (@SecPompeo) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆగ్నేయాసియా మిత్ర దేశాలతో అమెరికా ఏకీభవిస్తోంది. దక్షిణా చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల్లో చైనా సైనిక విన్యాసాలు రెచ్చగొట్టే చర్యలుగా పరిగణిస్తున్నాం. మేం చైనా చట్ట విరుద్ధమైన వాదనలను వ్యతిరేకిస్తున్నాం."

- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

కొంత కాలంగా వాణిజ్యం, కరోనా వైరస్, హాంకాంగ్ తదితర అంశాల్లో అమెరికా, చైనా మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో అణ్వాయుధ విమాన వాహక నౌకలను మోహరించటం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

South China Sea
అమెరికా అణ్వాయుధ నౌకలు

ఇదీ చూడండి: మోదీ పర్యటనతో ఉలిక్కిపడిన చైనా.. ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.