పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18మంది మరణించగా.. 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
వధ్ నుంచి దాడు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కుజ్దార్లోని కోరి ప్రాంతంలో అధిక వేగం కారణంగా బస్సు అదుపుతప్పినట్లు స్పష్టం చేశారు.