శ్రీలంకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 17 మంది మరణించారు. వర్షాల ధాటికి 2.70 లక్షల మంది ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు.
గురువారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీలంకలోని పది జిల్లాల్లో ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. పంటలు నీటమునిగాయి. ఈ జిల్లాల్లో 2,71,000 మందిపై వర్షాల ప్రభావం పడిందని జిల్లా విపత్తు నిర్వహణ కేంద్ర(డీఎంసీ) తెలిపింది. ఒక్కగంపాహా జిల్లాలోనే లక్షా 61 వేల మందిపై ప్రభావం పడిందని చెప్పింది.
వర్షాల కారణంగా పునరావాస శిబిరాల సంఖ్యను 106కు పెంచినట్లు డీఎంసీ వెల్లడించింది. 26,808 మంది ఈ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా 17 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా.. 978 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయయని చెప్పింది.
శ్రీలంకలో 50 మి.మీ వర్షం కురిసిందని అక్కడి వాతావారణ విభాగం తెలిపింది. కొండచరియలు విరిగపడే సూచనలు ఉండగా.. అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యల్లో శ్రీలంక నౌకాదళం నిమగ్నమైంది.
ఇదీ చూడండి: 'భారత్-నేపాల్ మధ్య అపార్థాలు తొలగిపోయాయి'