చైనాలోని కిజియాంగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చాంగ్కెంగ్ మున్సిపాలిటి పరిధిలోని సాంగ్జావో బొగ్గు గనిలో చిక్కుకుని 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కార్బన్ మోనాక్సైడ్ స్థాయులు పెరిగిపోవటం వల్లే ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
గని లోపల మండుతున్న బొగ్గుతో కార్బన్ మోనాక్సైడ్ స్థాయులు భద్రతా పరిమితిని మించి పోయాయని, 17 మంది అందులోనే చిక్కుకుపోవటం వల్ల ప్రమాదం జరిగినట్లు చైనా అధికారిక మీడియా జిన్హువా నివేదించింది.
75 మందితో కూడిన రెస్క్యూ బృందం, 30 మంది ఆరోగ్య సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
సాంగ్జావో బొగ్గు గని స్థానిక ఇంధన సంస్థకు చెందినదిగా అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: సైన్యం కళ్లుగప్పేందుకు ఉగ్రవాదుల నయా ట్రెండ్