ETV Bharat / international

పాక్​లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 15మంది మృతి! - పాక్​లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 15 మంది మృతి!

పాకిస్థాన్​లో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో 15 మంది చనిపోయారు. మరో 42 మంది గాయాలపాలయ్యారు. భూ వివాదం నేపథ్యంలో రెండు గిరిజన బృందాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడుతున్నట్టు అధికారులు తెలిపారు.

15 killed, 42 injured in fighting between two rival tribes in northwest Pakistan
పాక్​లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 15 మంది మృతి!
author img

By

Published : Jul 2, 2020, 10:24 PM IST

పాకిస్థాన్​లో రెండు గిరిజన బృందాల మధ్య జరిగిన ఘర్షణల్లో సుమారు 15మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 42మందికి గాయాలయ్యాయి. వాయువ్య పాక్​​లోని గిరిజన ప్రాంతంలో తలెత్తిన ఓ భూ వివాదంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి.

కుర్రం జిల్లాలో నాలుగు రోజులుగా టోరి- పారా చంకాని తెగల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు అత్యాధునిక ఆయుధాలతో దాడులకు పాల్పడుతున్నట్టు అధికారులు తెలిపారు.

ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు స్థానిక పాలనాధికారులు, గిరిజన పెద్దలు సహా అక్కడి పార్లమెంట్​ సభ్యులు రంగంలోకి దిగారు. రెండు సమూహాలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున అధికారులు.. గురువారం ఈ వివాదానికి తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: పోలీసుపై కత్తితో దాడి.. ఆందోళనకారుడి అరెస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.