Nepal Bus Accident: బస్సు లోయలో పడి 14 మంది మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం నేపాల్లో జరిగింది. తూర్పు నేపాల్లో గురువారం ఉదయం 7.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శంఖువాసవలోని మాడి నుంచి ఝాపాలోని దమక్కు వెళ్తుండగా.. బస్సు అదుపు తప్పి 300 మీటర్ల లోతు లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఇదీ చూడండి: ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం.. ప్రసూతి ఆసుపత్రి ధ్వంసం