శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 24మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. మారణకాండకు పాల్పడినవారు ఒకే ముఠాకు చెందినవారని లంక ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ఈ దుశ్చర్య తమ పనేనని ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా ప్రకటించలేదు.
నేషనల్ తౌవీత్ జమాత్(ఎన్టీజే) ముఠా ఈ విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 2018లో బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసి శ్రీలంకలో విధ్వంసం సృష్టించారు ఎన్టీజే తీవ్రవాదులు.
ఎల్టీటీఈ తరహా దాడులు
గతంలో ఇలాంటి వేర్పాటువాద దాడులకు ఎల్టీటీఈ పాల్పడింది. ప్రత్యేక తమిళ దేశం కావాలంటూ 30 ఏళ్ల పాటు సాయుధ పోరాటం చేసింది. 70-80వేల మంది వరకు ఆ పోరాటాల వల్ల బలై ఉంటారని అంచనా. 2009లో ఎల్టీటీఈ అధిపతి ప్రభాకరన్‌ను శ్రీలంక సైన్యం హతమార్చింది. ఆ ఘటన అనంతరం ఆ సంస్థ తుడిచిపెట్టుకుపోయింది.