ETV Bharat / international

అఫ్గాన్​లో ఘర్షణలు- 2రోజుల్లో 119 మంది మృతి! - తాలిబన్లు

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు, భద్రతా బలగాల మధ్య కాల్పుల్లో రెండు రోజుల వ్యవధిలోనే 119 మంది మృతి చెందారు. వారిలో 17 మంది పౌరులు ఉన్నారు.

people killed in Afghanistan
అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు
author img

By

Published : Jun 7, 2021, 2:23 PM IST

అఫ్గానిస్థాన్​లో భద్రతా బలగాలు, తాలిబన్లకు మధ్య ఘర్షణల్లో రెండు రోజుల్లోనే 119 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆ దేశంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగటం ఆందోళన కలిగిస్తోంది.

జూన్​ 3వ తేదీన 54 మంది, 4న 65 మంది మరణించినట్లు ఓ అధికారి వెల్లడించారు. వారిలో 102 మంది భద్రతా సిబ్బంది, 17 మంది పౌరులు ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో మరో 196 మంది సిబ్బంది గాయపడినట్లు చెప్పారు.

అయితే ఈ రెండు రోజుల్లో 364 మంది తాలిబన్లు హతమైనట్లు రక్షణ శాఖ వెల్లడించింది.

తాలిబన్లకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణల్లో అమాయక ప్రజలు బలవుతున్నారు. గతేడాది ఏకంగా 2,950 మంది పౌరులు మరణించగా, 5540 మందికి పైగా గాయాలపాలయ్యారు.

ఇదీ చూడండి: అఫ్గాన్​ బలగాల దాడుల్లో 20 మంది తాలిబన్లు హతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.