ETV Bharat / international

పాక్​ బలగాల కాల్పుల్లో 16 మంది ఉగ్రవాదులు హతం

author img

By

Published : Oct 23, 2021, 7:47 PM IST

Updated : Oct 24, 2021, 10:48 AM IST

ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టాయి పాకిస్థాన్ భద్రతా బలగాలు. శనివారం జరిపిన దాడుల్లో 16 మంది ముష్కురులను మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు పాక్ సైనికులు మరణించారు. మరోవైపు.. అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఇద్దరు పౌరులు మరణించారు.

pakistan raids on militants
పాక్​లో ముష్కరులు హతం

ఉగ్రవాదానికి కొమ్ముకాస్తూ తామూ బాధిత దేశంగా చెప్పుకుంటున్న పాకిస్థాన్​.. ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్​ మొట్టికాయలు వేసిన క్రమంలో తీవ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టింది. తాజాగా.. వాయువ్య, నైరుతి పాకిస్థాన్​లో జరిపిన దాడుల్లో 16 మంది ఉగ్రవాదులను ఆ దేశ భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఈ ఘటనల్లో ఇద్దరు పాక్​ సైనికులు మరణించారు.

బలూచిస్థాన్ రాష్ట్రంలోని మస్తుంగ్ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా.. 9 మంది ముష్కరులు హతమయ్యారు. ఈ మేరకు పాకిస్థాన్​ ఉగ్రవాద వ్యతిరేక విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఘటనాస్థలిలో తుపాకులు, పేలుడు పదార్థాలు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది.

మరోవైపు, రాష్ట్రంలోని హర్నాయి జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్​లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) కమాండర్ సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మరో ఉగ్రవాది హతం

ఉత్తర వాజిరిస్థాన్​లోని మిరాన్ షా ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలు సోదాలు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా... భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతం కాగా.. ఇద్దరు సైనికులు మరణించారు. ఈ మేరకు పాక్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది.

మెడపై ఎఫ్ఏటీఎఫ్ కత్తి

పాకిస్థాన్​ మరికొన్నాళ్లుపాటు 'గ్రే' జాబితాలో కొనసాగుతుందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్​ ఫోర్స్​(ఎఫ్​ఏటీఎఫ్​) రెండురోజుల క్రితం తెలిపింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్దేశించిన 34 విధుల్లో 30 విధులను మాత్రమే పాక్​ నెరవేర్చగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్​ఏటీఎఫ్ చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ఆ దేశం చేపట్టినట్లు స్పష్టమవుతోంది.

అఫ్గాన్​లో బాంబు దాడి..

తూర్పు అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల వాహనం లక్ష్యంగా శనివారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఈ మేరకు తాలిబన్, ఆరోగ్య అధికారులు తెలిపారు. మరో నలుగురు గాయపడ్డారని చెప్పారు.

తాలిబన్ల వాహనం వెళ్తున్న ఓ రోడ్డుపై ఈ బాంబులను అమర్చారని జిల్లా పోలీస్ చీఫ్ ఇస్మాతుల్లా ముబారిజ్ తెలిపారు. ఈ ఘటనలో తాలిబన్లు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. అయితే.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనేనని అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: అమెరికా డ్రోన్​ దాడి.. అల్​ఖైదా నేత హతం

ఇదీ చూడండి : తైవాన్‌ ఆక్రమణకు చైనా తహతహ- అగ్రరాజ్యం కన్నెర్ర!

Last Updated : Oct 24, 2021, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.