ETV Bharat / international

యూట్యూబ్​ కీలక నిర్ణయం- ఇక ఆ వీడియోలు డిలీట్​

ఓటర్లను తప్పుదారి పట్టించే వీడియోలను తమ వెబ్​సైట్​ నుంచి తొలగించనున్నట్లు అంతర్జాల దిగ్గజం యూట్యూబ్​ ప్రకటించింది. ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసకున్నట్లు తెలిపింది.

YouTube to ban 'manipulated' content linked to elections
యూట్యూబ్​ కీలక నిర్ణయం- ఇక ఆ వీడియోలు డిలీట్​
author img

By

Published : Feb 4, 2020, 1:18 PM IST

Updated : Feb 29, 2020, 3:26 AM IST

అంతర్జాల దిగ్గజం యూట్యూబ్​ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్​లైన్​లో అసత్య వార్తలను నిరోధించడంలో భాగంగా.. ఓటర్లను తప్పుదారి పట్టించే వీడియోలను తమ వెబ్​సైట్​నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్దినెలల ముందు ఈ మేరకు చర్యలు చేపట్టింది ఆ సంస్థ.

ఆరోగ్యకరమైన రాజకీయాలను ప్రోత్సహించి, నమ్మదగిన సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది యూట్యూబ్. ఓటింగ్​, జనాభా గణన విషయంలో వినియోగదారులను తప్పుదారి పట్టించే సమాచారంపైనా నిషేధం విధించనున్నట్లు గూగుల్​ ఆన్​లైన్​ ట్రస్ట్​ అండ్​ సేఫ్టీ విభాగం సారథి క్రిస్టీ కానెగల్లో తెలిపారు.

"ఎన్నికల సమయంలో మా వినియోగదారులను అసత్య వార్తల నుంచి కాపాడాల్సిన బాధ్య మాపై ఉంది. ఇతర సాంకేతిక, ప్రభుత్వ సంస్థలతో కలిసి నకిలీ ఖాతాలను గుర్తించి వాటిని తొలగించేందుకు కృషి చేస్తున్నాం."

-క్రిస్టీ కానెగల్లో, గూగుల్​ ఆన్​లైన్​ ట్రస్ట్​ అండ్​ సేఫ్టీ సారథి

అమెరికాలో 2016 ఎన్నికల్లో నకిలీ వార్తల వ్యాప్తి జోరుగా సాగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆన్​లైన్​ ప్లాట్​ఫార్మ్​లు ఈసారి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. తమ వెబ్​సైట్​లో అన్ని రాజకీయ ప్రకటనలను నిషేధిస్తామని ట్విట్టర్ ఇటీవల ప్రకటించింది. ఫేస్​బుక్ మాత్రం కొన్ని మినహాయింపులతో రాజకీయ ప్రకటనల కోసం 'హ్యాండ్​ ఆఫ్' విధానాన్ని తీసుకొచ్చింది.

Last Updated : Feb 29, 2020, 3:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.