అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్ ట్రంప్ ఖాతాను తాత్కాలికంగా నిషేధించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇటీవల పార్లమెంటులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఖాతాలో తాజాగా అప్లోడ్ అయిన ఓ వీడియోను తొలగించాము. అది మా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. తొలి ఉల్లంఘన కావడం వల్ల ఏడు రోజుల పాటు ఖాతాపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నాము.
-యూట్యూబ్
కామెంట్ సెక్షన్‌ను కూడా తొలగించామని స్పష్టం చేసింది యూట్యూబ్. అయితే ఆ వీడియోలో ఏ అంశాలను పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నారో అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
ఇదీ చదవండి : నాపై అభిశంసన తీర్మానం హాస్యాస్పదం: ట్రంప్