భారత్- పాకిస్థాన్లే కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. కానీ ఇరు దేశాలు కోరితే సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్నారు.
"మోదీ- ఇమ్రాన్ ఎంతో మంచి వారు. ఇద్దరు ఒకే తాటిపై నడుస్తారని ఆశిస్తున్నా. కానీ నా మధ్యవర్తిత్వం కోరితే... కచ్చితంగా సహకరిస్తా. ఇదే విషయం ఇరుదేశాలకు స్పష్టం చేశాయి."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ట్రంప్ వ్యాఖ్యలపై రగడ...
గతవారం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటించారు. పాక్ ప్రధానితో సమావేశమైన అనంతరం అమెరికా అధ్యక్షుడు కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. భారత ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని ట్రంప్ అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలను ఇమ్రాన్ స్వాగతించారు. అగ్రరాజ్య అధ్యక్షుడి ప్రకటనను భారత్ ఖండించింది. అప్పటికే భారత్లో ఈ అంశంపై తీవ్ర దుమారం రేగింది. ప్రధాని జవాబు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఇదీ చూడండి:- టెస్టు ఛాంపియన్షిప్:2 ఏళ్లు సాగే క్రికెట్ యాత్ర