ETV Bharat / international

అమెరికాలో 4.6లక్షలు దాటిన కరోనా మరణాలు - ప్రపంచ కరోనా కేసుల వివరాలు

ప్రపంచవ్యాప్తంగా మరో 5లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 14వేల మంది మహమ్మారికి బలయ్యారు. అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచదేశాల్లో నమోదవుతోన్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

worldwide new corona cases and deaths updates and america's death toll
కరోనా అప్​డేట్:​ కొత్తగా 5 లక్షలకు పైగా..
author img

By

Published : Feb 5, 2021, 9:48 AM IST

ఏడాది గడిచినా అమెరికాలో కరోనా మహమ్మారి మృత్యు ఘంటికలు ఆగడం లేదు. అక్కడ మృతుల సంఖ్య 4లక్షల 60వేలు దాటింది. రోజువారీ మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. రోజూ సగటున 3వేల కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కాలిఫోర్నియాలో మరణాల సంఖ్య మరింత ఆందోళనకరంగా ఉంది. గత వారం రోజులుగా అక్కడ రోజూ 500 మరణాలు నమోదతున్నాయి. అయితే వచ్చేవారం నుంచి అమెరికాలో కరోనా మరణాలు తగ్గే అవకాశం ఉందని ఆ దేశ అంటువ్యాధుల నివారణ, నియంత్రణ సంస్ధ అంచనా వేసింది.

  • ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వెలుగుచూసిన కేసుల్లో 1.21 లక్షలు అమెరికాలోనే నమోదయ్యాయి. 3,523మంది కరోనాకు బలయ్యారు. దీంతో అమెరికాలో మొత్తం బాధితుల సంఖ్య రెండు కోట్ల 72 లక్షల 73వేల 890కి చేరింది. మరణాల సంఖ్య 4.66 లక్షలకు పెరిగింది.
  • బ్రిటన్​లోనూ కరోనా విలయం కొనసాగుతోంది. అక్కడ మరో 20వేల 634మందికి కరోనా నిర్ధరణ అయింది. 316 మంది మరణించారు. రష్యాలో16వేలకు పైగా వైరస్ కేసులు బయటపడగా.. 521మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇక బ్రెజిల్​లోనూ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 57,848 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 1,291 మంది ప్రాణాలు కోల్పోయారు.

పలు దేశాల్లో నమోదైన కరోనా కేసులు..

దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా27,273,890466,988
రష్యా 3,917,91875,205
యూకే3,892,459110,250
ఫ్రాన్స్3,274,60877,852
బ్రెజిల్9,397,769228,883
టర్కీ2,508,98826,467
ఇటలీ2,597,44690,241
స్పెయిన్2,943,34960,802

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.