ETV Bharat / international

కోటి యాభై లక్షలకు చేరువలో కరోనా కేసులు - ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు

కరోనా ప్రపంచాన్ని కబలిస్తోంది. మొత్తం కొవిడ్ కేసులు కోటి 49 లక్షలు దాటాయి. మృతుల సంఖ్య 6 లక్షల 15 వేలకు పెరిగింది. అమెరికా, బ్రెజిల్, భారత్​, రష్యా, దక్షిణాఫ్రికాలు కరోనా ధాటికి అతలాకుతలం అవుతున్నాయి.

worldwide corona death toll
ప్రపంచవ్యాప్తంగా కోటీ యాభై లక్షలకు చేరువలో కరోనా కేసులు
author img

By

Published : Jul 21, 2020, 10:47 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య కోటి49 లక్షలు దాటింది. మరోవైపు మొత్తం మరణాల సంఖ్య 6 లక్షల 15 వేలకు చెేరింది. ఇప్పటివరకు 89 లక్షల 67 వేలకు పైగా బాధితులు కోలుకున్నారు.

అమెరికాను విలవిల..

అగ్రరాజ్యం అమెరికాను కరోనా ధాటికి విలవిలలాడుతోంది. ఇవాళ అక్కడ కొత్తగా 22,512 కేసులు, 420 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 39 లక్షల 83 వేలకు చేరగా.. మరణాలు లక్షా 44 వేలు దాటాయి.

ఉద్దీపన ప్యాకేజీ

కరోనా సంక్షోభం ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు యూకే మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం కూడా ఇదే దారిలో వెళుతోంది.

బ్రెజిల్​లో కరోనా ఉద్ధృతి

బ్రెజిల్​లో కొత్తగా 7,408 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. దీనితో మొత్తం కేసులు 21 లక్షల 29 వేలకు మించాయి. మరోవైపు 242మంది వైరస్​ బారిన పడి మరణించారు. మొత్తం మరణాలు సంఖ్య 80,493కి చేరింది.

రష్యాలో కరోనా కలవరం..

రష్యాలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా అక్కడ 5,842 పాజిటివ్ కేసులు, 153 మరణాలు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 83 వేలకు చేరగా.. మరణాల సంఖ్య 12 వేల 5 వందలకు పెరిగింది.

నేపాల్​

నేపాల్​లో కొత్తగా 150 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 18 వేలకు చేరింది. అయితే గత 48 గంటలుగా ఆ దేశంలో ఒక్క కరోనా మరణం సంభవించకపోవడం గమనార్హం.

దక్షిణ కొరియాలో కరోనా తిరగమోత

దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ ప్రారంభించింది. గత రెండు నెలల్లో చాలా వరకు కరోనా వ్యాప్తిని అరికట్టగలిగినప్పటికీ.. తాజాగా 40 కేసులు నమోదుకావడం ఆందోళ కలిగిస్తోంది.

worldwide corona death toll
ప్రపంచవ్యాప్తంగా కోటీ యాభై లక్షలకు చేరువలో కరోనా కేసులు

ఇదీ చూడండి: దద్దుర్లు కూడా కరోనా లక్షణమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.