ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా మరో 23 లక్షల మందికి కరోనా.. అమెరికాలో ఆగని ఉద్ధృతి​ - ఫ్రాన్స్​లో కేసులు

worldwide coronavirus cases: కరోనా మహమ్మారి యావత్​ ప్రపంచాన్ని వణికిస్తోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 23లక్షల మందికి వైరస్​ సోకింది. అమెరికాలో అదే ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 4 లక్షల కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. ఫ్రాన్స్​లో 3 లక్షలకుపైగా కొత్త కేసులు వచ్చాయి.

Worldwide corona cases today
ప్రపంచవ్యాప్తంగా మరో 23 లక్షల మందికి కరోనా
author img

By

Published : Jan 16, 2022, 7:27 AM IST

worldwide coronavirus cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజుకు 20 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్కరోజే 23,53,411 మందికి వైరస్​ అంటుకోగా.. 5,605 మంది మృతి చెందారు. ఇందులో దాదాపు 40 శాతం కేసులు ఒక్క అమెరికాలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అమెరికాలో ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా విస్తరిస్తూ రోజుకు లక్షల మందికి అంటుకుంటోంది. శనివారం ఒక్కరోజే 4,02,735 కొత్త కేసులు వెలుగు చూశాయి. 882 మంది వైరస్​కు బలయ్యారు. దీంతో మొత్తం కేసులు 66,662,877, మరణాలు 8,73,145కు చేరాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, వైరస్​ కారణంగా సిబ్బంది కొరతతో ఆరోగ్య వసతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆర్మీ వైద్యులను మోహరిస్తోంది బైడెన్​ ప్రభుత్వం.

ఫ్రాన్స్​లో అదే ఉద్ధృతి..

ఫ్రాన్స్​లో కరోనా ఉద్ధృతి తగ్గటం లేదు. డెల్టాతో పాటు ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభిస్తోంది. అలాగే కొత్త వేరియంట్​ను గుర్తించటం కలకలం సృష్టిస్తోంది. శనివారం మరో 3,24,580 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. 148 మంది మృతి చెందారు. 27వేల మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13,894,255, మరణాలు 1,26,869కి చేరాయి.

ప్రపంచవ్యాప్తంగా వైరస్​ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాల్లో..

  • ఇటలీలో వైరస్​ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 1,80,426 మందికి వైరస్​ సోకింది. 239 మంది మరణించారు. 1,25,199 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 120,609కు చేరింది.
  • ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. శనివారం ఒక్కరోజే 1,03,836 మందికి వైరస్​ సోకగా.. 55 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,640, 386కు చేరింది.
  • అర్జెంటీనాలో కొవిడ్​ వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 96,652 మందికి వైరస్​ సోకింది. 88 మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం కేసులు 7,029,624కు చేరాయి.
  • బ్రిటన్​లో కొత్తగా 81,713 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 287 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1.5 కోట్లు దాటింది.
  • టర్కీలో 63వేలు, జర్మనీలో 60 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. బ్రెజిల్​, రష్యా, కొలంబియా, మెక్సికో, ఫిలిప్పీన్స్​, బెల్జియం వంటి దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. రోజుకు దాదాపు 30వేలకుపైగా కొత్తగా వైరస్​ బారినపడుతున్నారు.

ఇదీ చూడండి: స్కూళ్లలోకి ఆ పిల్లలకు నో ఎంట్రీ- ప్రభుత్వం హెచ్చరిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.