ప్రపంచంపై కరోనా మహమ్మారి మహా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 6.34 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. అందులో 2 లక్షల కొత్త కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఆ తర్వాత బ్రెజిల్, భారత్‌లతో పాటు టర్కీలోనూ 30 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. పోలాండ్‌లో కొత్తగా 13,855 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 10 లక్షల మార్క్‌ను దాటింది. ఈ మైలురాయిని అందుకున్న 13వ దేశంగా నిలిచింది.
మొత్తం కేసులు: 64,844,711
మరణాలు: 1,499,346
కోలుకున్నవారు: 44,941,481
క్రియాశీల కేసులు: 18,403,884
- అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,03,427 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 1.43 కోట్లు దాటింది.
- బ్రెజిల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది కొత్తగా 48వేలకుపైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 669 మంది మరణించారు. ఇదే సమయంలో 41వేల మంది వైరస్ నుంచి కోలుకోవటం ఊరట కలిగిస్తోంది.
- టర్కీలో వైరస్ పంజా విసురుతోంది. కొత్తగా 31,923 కేసులు నమోదయ్యాయి. 193 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది.
- రష్యా, ఇటలీ, జర్మనీల్లో ఒక్క రోజు కేసుల్లో 20 వేలకుపైగా నమోదయ్యాయి. ఆ తర్వాత బ్రిటన్‌లో 16వేలు, ప్రాన్స్‌లో 14వేలు, పోలాండ్, ఇరాన్, ఉక్రెయిన్లలో 13వేల చొప్పున కొత్త కేసులు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు
దేశం | మొత్తం కేసులు | మరణాలు |
అమెరికా | 14,313,941 | 279,865 |
బ్రెజిల్ | 6,436,650 | 174,531 |
రష్యా | 2,347,401 | 41,053 |
ఫ్రాన్స్ | 2,244,635 | 53,816 |
స్పెయిన్ | 1,682,533 | 45,784 |
యూకే | 1,659,256 | 59,699 |
ఇటలీ | 1,641,610 | 57,045 |
అర్జెంటీనా | 1,440,103 | 39,156 |
కొలంబియా | 1,334,089 | 37,117 |