ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 27లక్షల కరోనా కేసులు.. అమెరికాలో ఆగని ఉద్ధృతి - కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభణతో లక్షల మంది వైరస్​ బారినపడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 27లక్షల కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క అమెరికాలోనే 8.5లక్షలు కేసులు రాగా.. ఫ్రాన్స్​లో 3.28 లక్షలు వచ్చాయి. బ్రిటన్​, స్పెయిన్​, అర్జెంటీనా, టర్కీ, భారత్​ వంటి దేశాల్లో లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

World wide corona cases
కరోనా కేసులు
author img

By

Published : Jan 8, 2022, 10:04 AM IST

కరోనా కోరల్లో యావత్​ ప్రపంచం విలవిల్లాడుతోంది. డెల్టాకు తోడు ఒమిక్రాన్​ వేరియంట్​ జతకలిసి వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకు లక్షల మంది వైరస్​ బారినపడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 27.05 లక్షల మందికి వైరస్​ సోకింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 30.36 కోట్లు దాటింది. మరో 6,380 మంది మరణించగా.. మృతుల సంఖ్య 54.96 లక్షలకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 30 శాతానికిపైగా అమెరికాలోనే నమోదవుతున్నాయి. శుక్రవారం 8.49 లక్షల మందికి వైరస్​ సోకింది. మరో 2,025 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో మొత్తం కేసుల సంఖ్య 6,04,64,426కు చేరింది. ఇప్పటి వరకు 8,58,346 మంది మరణించారు.

వ్యాక్సినేషన్​ వేగంగా కొనసాగుతున్నప్పటికీ వైరస్​ బారినపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. మొత్తం కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్​ వేరియంట్​వే ఉండటం గమనార్హం. ఆసుపత్రుల్లో లక్షకుపైగా పౌరులు చికిత్స పొందుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే పలు పాఠశాలలు మూతపడ్డాయి.

కొవిడ్​ అధికంగా ఉన్న మరిన్ని దేశాలు..

  • ఐరోపాలోని పలు దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ఒమిక్రాన్​ సహా మరో కొత్త వేరియంట్​ ఫ్రాన్స్​ను కలవరపరుస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 3,28,214 కేసులు నమోదయ్యాయి. 193 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాలు 1,25,206, కేసులు 11,511,452కు చేరాయి.
  • బ్రిటన్​లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,78,250 కేసులు వెలుగుచూశాయి. 229 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 14,193,228కి చేరింది.
  • స్పెయిన్​లో వైరస్​ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 1,15,900 మంది కరోనా సోకింది. 15 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో శుక్రవారం కొత్తగా 1,10,533 మందికి వైరస్​ సోకింది. 223 మంది మరణించారు. 27,582 మంది కోలుకున్నారు.
  • ఇటలీలో కొత్తగా 1,08,304 కేసులు బయటపడ్డాయి. 223 మంది వైరస్​ ధాటికి మృతి చెందారు.

ఇదీ చూడండి: కరోనా కల్లోలం- 71 శాతం పెరిగిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.