ETV Bharat / international

కరోనా విజృంభణ: ఒక్కరోజులో 2.58 లక్షల కేసులు - WORLD WIDE CORONA CASES DETAILS

ప్రపంచ దేశాలపై కొవిడ్-19​ కోరలు చాస్తోంది. పలు దేశాల్లో సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రోజుకు 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే 2,58, 896 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5,717మంది మహమ్మారి బారినపడి మరణించారు. ఇప్పటివరకు నమోదైన వైరస్ కేసుల సంఖ్య కోటీ 62 లక్షలకు చేరువైంది.

WORLD WIDE CORONA CASES
కరోనా విలయం: రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు
author img

By

Published : Jul 26, 2020, 8:26 AM IST

Updated : Jul 26, 2020, 10:28 AM IST

ప్రపంచంపై కరోనా ఉగ్రరూపం అంతకంతకూ పెరిగిపోతోంది. కేసుల సంఖ్యలో రోజూ సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 2 లక్షలకుపైగా కేసులు వస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే.. వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగటం.. కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 2,58,896 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5,717 మంది మహమ్మారికి బలయ్యారు.

WORLD WIDE CORONA CASES DETAILS
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు

అమెరికాలో 43 లక్షలకు పైనే..

అగ్రరాజ్యంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు 60-70 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 43 లక్షలు దాటింది. సుమారు 1.50 లక్షల మంది వైరస్​ ధాటికి బలయ్యారు. మరో 20 లక్షల 60 వేల మందికిపైగా బాధితులు వైరస్​ నుంచి కోలుకున్నారు.

బ్రెజిల్​లో రికార్డు స్థాయిలో..

కేసులు, మరణాల్లో రెండోస్థానంలో కొనసాగుతోన్న బ్రెజిల్​లో వైరస్​ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడంలేదు. రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 24 లక్షలకు చేరువైంది. సుమారు మరో 86.5 వేల మంది వైరస్​ బారినపడి మరణించారు.

రష్యాలో..

రష్యాలో కొవిడ్​ కేసుల సంఖ్య 8.5 లక్షలు దాటింది. 13 వేలకుపైగా వైరస్​ సోకి చనిపోయారు. అక్కడ ఇప్పటివరకు సుమారు 6 లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

దాయాది దేశంలో ఇలా..

పాకిస్థాన్​లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో 2,700కు పైగా కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2.73 లక్షలు దాటింది. మరణాల సంఖ్య కూడా 6 వేలకు చేరువైంది.

ఆయా దేశాలపై కొవిడ్​ ప్రతాపం కొనసాగుతోందిలా...

దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా 43,15,709 1,49,398
బ్రెజిల్23,96,434 86,496
రష్యా 8,06,720 13,192
దక్షిణాఫ్రికా 4,34,200 6,655
మెక్సికో 3,85,036 43,374
పెరు 3,79,884 18,030
చిలీ 3,43,592 9,020
స్పెయిన్ 3,19,501 28,432
బ్రిటన్ 2,98,681 45,738

ఇదీ చూడండి: అగ్రరాజ్యంలో మరోసారి నిరసనల హోరు

Last Updated : Jul 26, 2020, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.