టిమ్ బెర్నర్స్ లీ 1991 ఆగస్టులో తమ మొట్టమొదటి వెబ్సైట్ http://info.cern.ch ను ప్రారంభించారు. తన ఆవిష్కరణకు పేటెంట్ తీసుకోవడానికి బదులుగా, రాయల్టీ ఫ్రీ సాఫ్ట్వేర్గా అందరికీ ఆందుబాటులోకి తీసుకువచ్చారు.
టిమ్ వేసిన పునాదిపై వేరే ప్రోగ్రామర్లు వెబ్సైట్ల రూపకల్పన చేసేందుకు మార్గం సుగమమైంది. నేడు సుమారు వంద కోట్ల వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు మూడు వందల కోట్ల మంది ఆన్లైన్ సేవలను వినియోగించుకుంటున్నారు.
దుర్వినియోగాన్ని నిరోధించలేమా?
ఆన్లైన్ సేవల్లో వెలుగుచూస్తోన్న గోప్యత కుంభకోణాలు, నకీలు వార్తలు, ఆన్లైన్ వేధింపులు వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. ప్రజలు మరింత సురక్షితంగా వెబ్ వినియోగించడానికి 'వరల్డ్ వైడ్వెబ్ ఫౌండేషన్' ఓ ప్రణాళిక రచించింది. 2019 మే నాటికి దీనిని ఆచరణలో పెట్టాలని ప్రయత్నిస్తోంది.
"మొదటిసారిగా ప్రపంచంలోని సగం జనాభా ఆన్లైన్ వినియోగదారులుగా ఉన్నారు. కనుక ఇప్పుడు వెబ్ ప్రపంచాన్ని మరింత సురక్షితం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల సమాచార గోప్యత హక్కు పరిరక్షించాలి. ప్రభుత్వాల విధించే సెన్సార్షిప్ సమస్యలను అధిగమించాలి. ప్రజలు సురక్షితమైన పద్ధతిలో ఆన్లైన్ సేవలు పొందగాలగాలి. అంతేగాని వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా హాని కలిగించకూడదు."- ఆడ్రియన్ లవ్వెట్, వరల్డ్ వైడ్ వెబ్ ఫౌండేషన్ సీఈవో