కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను చుట్టేసింది. ఇప్పటివరకు 1,51,92,611మంది వైరస్ బారినపడ్డారు. 6,21,998 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా వంటి పెద్ద దేశాలతో పాటు మెక్సికో, పెరూ, చిలీ వంటి చిన్నదేశాల్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది.
అమెరికా...
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 20,584మంది వైరస్ బారినపడ్డారు. 323మంది వైరస్‌తో మరణించారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 40,49,153కు చేరగా... మృతుల సంఖ్య 1,45,276కు పెరిగింది.
బ్రెజిల్..
కరోనా కేసుల సంఖ్యలో రెండో స్థానంలో ఉంది బ్రెజిల్. తాజాగా ఒక్కరోజే 11,627మందికి వైరస్ సోకింది. మరో 231మంది కొవిడ్‌తో చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,78,159కు చేరింది. ఇప్పటివరకు 81,828 మంది ప్రాణాలు కోల్పోయారు.
రష్యా..
రష్యాలో కొత్తగా 5,862 కేసులు వెలుగు చూశాయి. మరో 165మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,89,190కు చేరింది. మరణాల సంఖ్య 12,745కు పెరిగింది.
మెక్సికోలో..
మెక్సికోలో ఒక్కరోజే 6,859 మందికి కరోనా సోకింది. అయితే అత్యధికంగా 915మందిని వైరస్ బలిగొంది. ఫలితంగా మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 3,56,255 చేరగా... మృతుల సంఖ్య 40,400కు పెరిగింది.
ఇతర దేశాల్లో ఇలా..
- పాకిస్థాన్‌లో కొత్తగా 1,332మంది వైరస్ బారినపడగా... 38మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 2,67,428మందికి కరోనా సోకింది. మరో 5,677మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఒక్కోరోజే 484మంది వైరస్ బారిన పడ్డారు.
- సింగపూర్‌ను కరోనా వణికిస్తోంది. తాజాగా 310మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 48,744కు చేరింది.
- నేపాల్‌లో తాజాగా వెలుగు చూసిన 100 కరోనా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 18వేలు దాటింది. ఇప్పటివరకు 42 మంది మరణించారు.
ఇదీ చూడండి: 'ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్ సొంతం'