ETV Bharat / international

అమెరికాలో హింసపై ప్రపంచదేశాల ఆందోళన

వాషింగ్టన్​లో జరిగిన హింసాత్మక ఘటనను ప్రపంచదేశాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి. ఈ ఆందోళన ప్రజాస్వామ్యంపై దాడి వంటిదని అభివర్ణించాయి. చట్టాలను, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నాయి. మరోవైపు చైనా మాత్రం దీన్ని అందమైన దృశ్యంగా చెప్పుకొచ్చింది.

World leaders concerned at clashes in Congress
అమెరికాలో హింసపై ప్రపంచదేశాల ఆందోళన
author img

By

Published : Jan 8, 2021, 5:45 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనతో వాషింగ్టన్ అట్టుడికింది. అగ్రరాజ్య చరిత్రలో మాయని మచ్చ వంటి ఘటనకు క్యాపిటల్ భవనం వేదికైంది. వందలాది మంది ఆందోళనకారులు భవనంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండించాయి. నిరసనకారుల తీరును తప్పుబట్టాయి.

వాషింగ్టన్​లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి సమయంలో నాయకులు పరిణతితో మద్దతుదారులను సముదాయించాలని సూచించింది. చట్టాలను, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో ఈ తరహా ఘటనలు ఆందోళన కలిగించే విషయమని ఐరాస జనరల్‌ అసెంబ్లీ 75వ సమావేశాలకు అధ్యక్షుడిగా ఉన్న వోల్కన్‌ బోజ్‌కిర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అణచివేయలేం: భారత్

అమెరికాలోని వాషింగ్టన్ ‌డీసీలో అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగడం బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రమబద్ధంగా, శాంతియుతంగా అధికార బదిలీ జరగాలని ఆకాంక్షించారు. చట్ట విరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయలేమని పేర్కొన్నారు.

'ట్రంప్ మాటలే అగ్గిరాజేశాయి'

క్యాపిటల్ హిల్​పై జరిగిన భయంకరమైన దాడిని బ్రిటన్ ఖండించింది. అమెరికా కాంగ్రెస్​లో జరిగిన ఘటన అవమానకరమైనది ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పక్షాన నిలబడే అమెరికాలో శాంతియుతమైన అధికార బదిలీ జరగాలని ఆకాంక్షించారు.

హింసకు అధ్యక్షుడే కారణమని బ్రిటన్ హోంమంత్రి ప్రీతీ పటేల్ ఆరోపించారు. ట్రంప్ వ్యాఖ్యలే ఆందోళనకు అగ్గిరాజేశాయని అన్నారు. నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు ట్రంప్ ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ హింసను ఖండించలేదని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బ: హాంకాంగ్

అమెరికాలో జరిగిన హింస ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బ వంటిదని హాంకాంగ్ వాసులు అభివర్ణించారు. అమెరికా గౌరవానికి ఈ ఘటన వల్ల భంగం కలిగిందని ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలు పేర్కొన్నారు. హాంకాంగ్​లోని బీజింగ్ అనుకూల వర్గాలు సైతం ఘటనను ఖండించాయి. ఈ ఘటనను తిరుగుబాటుగా పేర్కొన్నాయి. ప్రభుత్వం పట్ల గౌరవం, శాంతి భద్రతలకు భంగం కలిగాయని ఆరోపించాయి.

ఆమోదించేది లేదు: ఫ్రాన్స్

ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేవారి నిరసనలను ఆమోదించే ప్రసక్తే ఉండదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పేర్కొన్నారు. అమెరికా హింసను ఉద్దేశించి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రజాస్వామ్యంపై తమకు విశ్వాసం ఉందని, వాషింగ్టన్​లో జరిగిన ఘటన.. అమెరికాను సూచించేది కాదని అన్నారు.

ప్రజాస్వామ్యంపై దాడి: కెనడా

అమెరికా క్యాపిటల్ వద్ద కనిపించే దృశ్యాలు ప్రజాస్వామ్యంపై దాడి వంటివని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో ఉద్రిక్తతల పట్ల కెనడా ప్రజలు మనస్తాపానికి గురయ్యారని అన్నారు. హింస ద్వారా ప్రజల అభీష్టాన్ని మార్చలేరని వ్యాఖ్యానించారు.

అందమైన దృశ్యం: చైనా

కాగా, చైనా మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించింది. ఈ ఉదంతాన్ని 'అందమైన దృశ్యం' అని అభివర్ణిస్తూ సంబంధిత చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ప్రజాస్వామ్యానికి చేటు అని పలు ప్రపంచ దేశాలు ఈ ఘటనను ఖండించిన నేపథ్యంలో డ్రాగన్‌ ఈ విధంగా స్పందించింది. హాంకాంగ్‌ అల్లర్లను సమర్థించి, వాషింగ్టన్‌ ఘటనను ఖండించడం ద్వారా.. యూరోపియన్‌ దేశ నాయకులందరూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారంటూ ఆ పార్టీ విమర్శించింది.

మరోవైపు, అమెరికాలోని తమ దేశీయులు అప్రమత్తంగా ఉండాలని చైనా, టర్కీ హెచ్చరికలు జారీ చేశాయి.

'అణచివేయడం ఆపండి'

ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం ఆపాలని ట్రంప్ మద్దతుదారులకు జర్మనీ విదేశాంగ మంత్రి హెయికో మాస్ సూచించారు. ప్రజాస్వామ్య శత్రువులు ఈ దృశ్యాలను చూసి ఆనందిస్తారని వ్యాఖ్యానించారు. ఉసిగొల్పే వ్యాఖ్యలు హింసాత్మక చర్యలు పాల్పడేలా దోహదం చేస్తాయని పేర్కొన్నారు.

దిగ్భ్రాంతి: నాటో

వాషింగ్టన్ దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్​బర్గ్ అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల ఫలితాలను గౌరవించాలని హితవు పలికారు.

ఎదురుచూస్తున్నాం: ఆస్ట్రేలియా

అమెరికాలో హింసను పూర్తిగా ఖండిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు. ఘనమైన అమెరికా ప్రజాస్వామ్య సంస్కృతి ప్రకారం శాంతియుత అధికార బదిలీ జరగాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

అల్లరి మూకలు మార్చలేవు: న్యూజిలాండ్

అమెరికాలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లు, వారి నిర్ణయాన్ని గౌరవించాలని అన్నారు. తుది ఫలితాన్ని అల్లరిమూకలు మార్చలేవని స్పష్టం చేశారు.

ఖండించిన వారెందరో...

నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే, ఐర్లాండ్ ప్రధాని మైఖెల్ మార్టిన్, గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిత్సోటకిస్, స్పెయిన్ అధ్యక్షుడు పెట్రో సాంషెజ్, డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ సైతం అమెరికా ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.