ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 2కోట్ల 46లక్షల 22వేల 014కు చేరింది. మహమ్మారి వల్ల 8లక్షల 35వేల 530మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు కోటి 70లక్షల మందికి పైగా వ్యాధి నుంచి కోలుకున్నారు.
- అమెరికాలో రోజురోజుకు కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. 60.46 లక్షల మంది వైరస్ బారినపడగా.. 33.47లక్షల మంది కోలుకున్నారు. 1.84లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో వైరస్ ఉద్ధృతి తగ్గడం లేదు. 37.64లక్షల మందికి వైరస్ సోకింది. లక్షా 18వేలకుపైగా వైరస్‌కు బలయ్యారు. ఇప్పటి వరకు 29.47లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- రష్యాలో తాజగా 4,711 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 121 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 9,75,576కు, మరణాల సంఖ్య 16,804కు చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 7,92,561 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- పెరూలో కొత్తగా 8,619 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,21,997కు చేరింది. 153 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 28,277కు చేరింది. 4,29,662 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ప్రపంచ దేశాల్లో కేసుల వివరాలు ఇలా..
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 6,046,634 | 184,796 |
బ్రెజిల్ | 3,764,493 | 118,726 |
రష్యా | 975,576 | 16,804 |
పెరూ | 621,997 | 28,277 |
దక్షిణాఫ్రికా | 618,286 | 13,628 |
కొలంబియా | 582,022 | 18,468 |
మెక్సికో | 573,888 | 62,076 |