ETV Bharat / international

కరోనా పంజా.. మెక్సికోలో 60 వేలకు చేరిన మృతులు

author img

By

Published : Aug 24, 2020, 8:24 AM IST

కరోనా మహమ్మారి విలయంలో ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. వైరస్​ విజృంభణతో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2.36కోట్లకు చేరువైంది.. 8.12లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​, రష్యాల్లో వైరస్​ ఉద్దృతి ఎక్కువగా ఉంది.

world covid-19 tracer
కరోనా పంజా.. మెక్సికోలో 60 వేల మంది మృతి

ప్రపంచంపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 2కోట్ల 36లక్షలకు చేరువైంది. 8.12 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో కోటి 60లక్షల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. మొత్తం 58.74 లక్షల మంది వైరస్​ బారినపడగా.. 1.80లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 31.67లక్షల మంది కోలుకున్నారు.
  • బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి తగ్గడం లేదు. 36.05లక్షల మందికి వైరస్​ సోకింది. లక్షా 14వేలకుపైగా వైరస్​కు బలయ్యారు. ఇప్పటి వరకు 27.09లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • రష్యాలో కొత్తగా 4,852 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 73 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 9,56,749కు, మరణాలు 16,383కి చేరాయి. అయితే.. 7.70 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
  • మెక్సికోలో తాజాగా 6,482 కేసులు వెలుగుచూశాయి. 644 మంది మంది ప్రాణాలు కోల్పోయారు.. మొత్తం 5,56,216 మంది బాధితులు ఉన్నారు. ఫలితంగా మరణాలు 60,254కు చేరాయి. .. 3.80 లక్షల మందికి వైరస్​ నయమైంది.
  • కొలంబియాలో తాజాగా నమోదైన కేసులతో కలిపి బాధితుల సంఖ్య 5,41,147కు చేరింది. దేశవ్యాప్తంగా 16,383 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు ఇలా..

దేశంకేసులుమరణాలు
అమెరికా58,74,146 1,80,604
బ్రెజిల్​36,05,783 1,14,772
రష్యా9,56,74916,310
దక్షిణాప్రికా609,773 13,059
పెరు594,326 27,663
మెక్సికో556,216 60,254
కొలంబియా541,147 17,316

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.