ETV Bharat / international

తల్లికి కరోనా ఉన్నా బిడ్డకు పాలివ్వొచ్చు: డబ్ల్యూహెచ్​ఓ - breastfeed during covid 19

కరోనా మహమ్మారితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్న పిల్లల తల్లులకు వైరస్​ సోకితే ఎలా? బిడ్డకు పాలివ్వొచ్చా? లేదా ? అనే అంశంలో గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో తల్లికి కరోనా ఉన్నా బిడ్డకు పాలివ్వొచ్చని సూచించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

Women with virus should still breastfeed
తల్లికి కరోనా ఉన్నా బిడ్డకు పాలివ్వొచ్చు
author img

By

Published : Jun 13, 2020, 9:58 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 పంజా విసురుతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్​ వ్యాప్తి చెందుతున్నందున తల్లులకు వైరస్​ సోకితే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా లేదా అనే అంశంలో సందిగ్ధం నెలకొంది. అలా చేస్తే బిడ్డకూ వైరస్​ సోకే ప్రమాదం ఉందన్న వాదనల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.

కరోనా సోకినా.. తల్లి బిడ్డకు పాలు ఇవ్వొచ్చని తెలిపారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ టెడ్రోస్​ అధనామ్​​. దాని ద్వారా ఇతర వ్యాధుల నుంచి పిల్లలను రక్షించవచ్చని పేర్కొన్నారు.

"చిన్నారులు కరోనా బారిన పడే ప్రమాదం చాలా తక్కువ ఉందని తెలుసు. కానీ, తల్లిపాలు అందకపోతే పలు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొవిడ్​-19 సోకిన, అనుమానిత తల్లులు బిడ్డకు పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించాలి. తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలోనే బిడ్డకు పాలివ్వటం నిలిపివేయాలి."

- టెడ్రోస్ అధనామ్​, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి

ఇదీ చూడండి: కరోనా వేళ.. తల్లిపాలు శ్రేయస్కరమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.