ETV Bharat / international

భర్త మరణించిన 14 నెలలకు.. పండంటి బిడ్డ! - 40 ఏళ్ల భర్త మరణించిన 14 నెలల తర్వాత శిశువుకు జన్మ

భర్త మరణించిన 14 నెలల తర్వాత బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. భర్త కోరిక మేరకే ఈ సాహసం చేసినట్లు చెప్పుకొచ్చింది. తన పిల్లలకు తండ్రిలేని లోటు రాకుండా చూసుకుంటానని ధీమాగా చెబుతోంది అమెరికాలోని ఓక్లహామాకు చెందిన సారా అనే ఉపాధ్యాయురాలు.

sara
స్కాట్-సారా షెలెన్​బెర్గర్ దంపతులు
author img

By

Published : Jul 21, 2021, 12:51 PM IST

40 ఏళ్ల ఓ మహిళ.. తన భర్త మరణించిన 14 నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే. భద్రపరిచిన పిండం ద్వారా సారా షెలెన్‌బెర్గర్ అనే మహిళ ఈ ఫీట్​ను సాధించింది. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన ఆమె మే 3న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

చిన్నారి రాకతో తన మాతృహృదయం సంతృప్తి చెందిందని.. బిడ్డను గుండెలకు హత్తుకోవడం గొప్ప అనుభవాన్ని ఇస్తోందని సారా పేర్కొంది. ఆమె భర్త స్కాట్‌(41) గతేడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించారు. అతను మరణించిన ఆరు నెలల అనంతరం.. బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్‌ సహకారంతో సారా ఈ ప్రక్రియను పూర్తి చేసింది.

sara
భద్రపరచిన పిండం ద్వారా జన్మించిన శిశువు
sara
బిడ్డతో సారా షెలెన్​బెర్గర్

"మేం కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని భావించేవాళ్లం. ఈ సమయంలో బిడ్డకు జన్మనివ్వాలన్న నిర్ణయానికి నా భర్త మద్దతు ఉందని కచ్చితంగా చెప్పగలను. బిడ్డ పుట్టినప్పటి నుంచి నా జీవితానికి ఒక అర్థం లభించింది. నా పిల్లలకు తండ్రిలేని లోటు లేకుండా పెంచుతా."

-సారా షెలెన్​బెర్గర్

sara
స్కాట్- సారా షెలెన్​బెర్గర్ దంపతులు

చిన్నారిని ముద్దుగా 'మెడిసిన్' అని పిలుచుకుంటోంది సారా.

sara
స్కాట్- సారా షెలెన్​బెర్గర్ దంపతులు
sara
స్కాట్- సారా షెలెన్​బెర్గర్ దంపతులు

"మరో పిండం భద్రపరచి ఉంది. అదే చివరిది. దీనితో వచ్చే ఏడాది చివరి నాటికి రెండో బిడ్డను కనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా."

-సారా షెలెన్​బెర్గర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.