ETV Bharat / international

ట్రంప్‌పై విష ప్రయోగానికి కుట్ర పన్నిన మహిళ అరెస్ట్‌! - poison sent by woman

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై విష ప్రయోగం కేసులో ఓ మహిళను అరెస్టు చేశారు పోలీసులు. పార్శిల్ కెనడా నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు... దాని ఆధారంగా విచారణ జరిపి, ఓ మహిళే నిందితురాలని తెలుసుకున్నారు.

Woman accused of sending ricin letter arrested
ట్రంప్‌పై విషప్రయోగానికి కుట్ర పన్నిన మహిళ అరెస్ట్‌!
author img

By

Published : Sep 21, 2020, 10:22 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై విష ప్రయోగం జరిపేందుకు కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. న్యూయార్క్‌-కెనడా సరిహద్దుల్లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రంప్‌నకు చేరేలా శ్వేతసౌధం చిరునామాతో వచ్చిన పార్శిల్‌ కెనడా నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా జరిపిన విచారణలో ఓ మహిళే నిందితురాలని తేలినట్లు తెలుస్తోంది. ఆమె వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు.

'రైసిన్‌' అనే విషం ఉన్న ఓ పార్శిల్‌ను అధ్యక్ష భవనానికి చేరకముందే పోలీసులు పరీక్షించి అడ్డుకున్నారు. ఆ పార్శిల్‌ను ఎవరు పంపించారో గుర్తించేందుకుగానూ ఎఫ్‌బీఐ, సీక్రెట్‌ సర్వీస్‌, అమెరికా పోస్టల్‌ తనిఖీ సేవల విభాగం దర్యాప్తు చేశాయి.

ఇదీ చూడండి: శ్వేతసౌధంలో కలకలం.. ట్రంప్​కు పార్సిల్​లో విషం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.