ETV Bharat / international

వ్యవహార శైలిపరంగానూ ట్రంప్​ది రికార్డే! - trump records

డొనాల్డ్​ ట్రంప్​ తన వ్యవహార శైలిపరంగా మరో రికార్డునూ సృష్టించేలా ఉన్నారు. నిబంధనల ప్రకారం అధ్యక్షుడి దస్త్రాలను జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంది. దానికి విరుద్ధంగా ఆయనే వాటిని చెల్లాచెదురుగా విసిరి పారేస్తూ రావడంతో ఇప్పుడు వాటన్నింటినీ వెతికిపట్టుకుని ఒక్క చోటకు చేర్చడం శ్వేతసౌధం సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఫైళ్లను ఇష్టానుసారంగా పడేసే అలవాటును మార్చూకోవాల్సిందిగా సిబ్బంది పలుమార్లు చెప్పినా ఆయన వినేవారు కాదని శ్వేతసౌధ రికార్డుల మాజీ విశ్లేషకుడు సాల్మన్ లార్టే చెప్పారు.

Will Trump's mishandling of records leave a hole in history?
వ్యవహార శైలితో ట్రంప్​ మరో రికార్డు!
author img

By

Published : Jan 18, 2021, 9:08 AM IST

అమెరికా అధ్యక్షుడిగా గద్దె దిగబోతున్న డొనాల్డ్​ ట్రంప్​ తన వ్యవహార శైలిపరంగా మరో రికార్డునూ సృష్టించేలా ఉన్నారు. తన వద్దకు వచ్చిన దస్త్రాలను కొన్నింటిని చించి అవతల పారేయడం ఆయనకు అలవాటు. నిబంధనల ప్రకారం అధ్యక్షుడి దస్త్రాలను జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంది. దానికి విరుద్ధంగా ఆయనే వాటిని చెల్లాచెదురుగా విసిరి పారేస్తూ రావడంతో ఇప్పుడు వాటన్నింటినీ వెతికిపట్టుకుని ఒక్క చోటకు చేర్చడం శ్వేతసౌధం సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఫైళ్లను ఇష్టానుసారంగా పడేసే అలవాటును మార్చూకోవాల్సిందిగా సిబ్బంది పలుమార్లు చెప్పినా ఆయన వినేవారు కాదని శ్వేతసౌధ రికార్డుల మాజీ విశ్లేషకుడు సాల్మన్ లార్టే చెప్పారు. 2018 నుంచి కనిపించకుండా పోయిన పత్రాలను వెతికిపట్టుకునేందుకు ఆయన అనేక గంటల సమయం వెచ్చించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో చేసిన సంభాషణపై దుబాసీ రాసిన నోట్సును ట్రంప్​ తన అధీనంలో పెట్టుకున్నారు. రికార్డుల బదలాయింపులో చోటు చేసుకుంటున్న జాప్యం కారణంగా అవి ఎంతవరకు నిష్పాక్షికంగా ఉన్నాయనే ఆందోళన మరింత పెరుగుతోంది. అధ్యక్ష భవనంలో రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం ఒక ఎత్తయితే.. కొన్నింటిని దాచిపెట్టమని చెప్పడం, మరికొన్నింటిని నాశనం చేయాలని చెప్పడం వల్ల ఈ పరిస్థితి తప్పదని అంచనా వేస్తున్నారు.

అధ్యక్షుని రికార్డుల చట్టం ప్రకారం జాతీయ పురావస్తు విభాగ సలహా తీసుకుని, అమెరికా కాంగ్రెస్​లో ప్రకటించిన తర్వాతే అధ్యక్షుడు ఏ రికార్డునైనా ధ్వంసం చేయాలి. అయితే పురావస్తు విభాగం ఇచ్చిన సలహాను పాటించాలనే నిబంధనేమీ లేదు.

ఎలక్ట్రానిక్​ రూపంలో అయినా..

అధ్యక్షుడికి సంబంధించి చాలా వరకు రికార్డులు ఎలక్ట్రానిక్​ రూపంలోనే ఉంటాయి. ఆటోమేటిక్ బ్యాకప్ సదుపాయం వల్ల వివరాలు భద్రంగానే ఉంటాయని అయితే అధ్యక్షుడే వద్దని చెప్పినప్పుడు మాత్రం అవి నమోదు కావని నిపుణులు చెబుతున్నారు. ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు దాదాపు 3 కోట్ల పత్రాలు, 250 టెరాబైట్ల ఎలక్ట్రానిక్​ రికార్డులు నమోదయ్యాయి. వీటిలో 150 కోట్ల ఈమెయిల్ పేజీలు కూడా ఉన్నాయి. ఇంతింత పరిమాణంలో దస్త్రాలను, ఇతర పత్రాలను తరలించడం, భద్రపరచడం ఆషామాషీ కాదు. గత నవంబర్​లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్​ ఓడిపోగానే చట్ట ప్రకారం రికార్డులను భద్రపరిచి తరలించేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు. ఓటమిని ఆయన ఒక పట్టాన ఒప్పుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈ నెల 20లోగా పని పూర్తయ్యేలా కనిపించడం లేదు. తరలింపునకు అవసరమయ్యే బడ్జెట్​ను అనేక వారాల పాటు విడుదల చేయకపోవడం ఒక కారణం. సమాచార స్వేచ్ఛ చట్టం కింద ట్రంప్​ పాలనకు సంబంధించి ప్రజలు ఏదైనా సమాచారాన్ని తీసుకోవాలంటే ఐదేళ్లయినా నిరీక్షించాల్సి వస్తోంది.

ఇదీ చూడండి: మన కమలకు రంగవల్లికలతో స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.