డెమొక్రాట్ జో బైడెన్ గెలిచినట్లు ఎలక్టోరల్ కాలేజీ నిర్ణయిస్తే శ్వేతసౌధాన్ని ఖాళీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎలక్టోరల్ కాలేజీ బైడెన్‌ను అధ్యక్షుడిగా ధ్రువీకరిస్తే శ్వేతసౌధం నుంచి తప్పుకుంటారా అన్న ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు బదులిచ్చారు.
అయితే, ఎలక్టోరల్ కాలేజీ ఈ విధంగా చేస్తే పెద్ద పొరపాటు అవుతుందన్నారు. దీన్ని అంగీకరించడం కష్టంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. జనవరి 20 వరకు ఎన్నో విషయాలు జరగబోతున్నాయని భారీ మోసం బయటపడుతుందని ఆయన చెప్పారు.
అక్రమాలపై మరోసారి..
అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని మరోసారి ట్రంప్ అన్నారు. ఓటింగ్ సదుపాయాల్లో అమెరికా మూడో దేశంగా ఉందన్న ట్రంప్.. హ్యాక్ చేయడానికి వీలు గల కంప్యూటర్ పరికరాలను అమెరికా ఉపయోగిస్తోందని చెప్పుకొచ్చారు.
బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ట్రంప్ నిరాకరించారు.
ఇదీ చూడండి: అధికార బదిలీకి ట్రంప్ అంగీకారం.. కానీ!