తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే వలసవాదులకు సంబంధించి బిల్లును ప్రవేశపెడతానని అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ వెల్లడించారు. ఈ చట్టం.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలను తిరగరాసే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
"ఇమ్మిగ్రేషన్ బిల్లును తక్షణమే ప్రవేశపెడతాను. అనంతరం కార్యకలాపాలు వెగంగా సాగేందుకు తగిన కమిటీ వద్దకు దానిని పంపిస్తాను."
--- జో బైడెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత.
ఈ నెల 20న జరగనున్న అధ్యక్షుడి ప్రమాణస్వీకార వేడుకతో అగ్రరాజ్య బాధ్యతలను చేపట్టనున్నారు బైడెన్.
ఈ విషయంపై ఇది వరకే స్పందించారు బైడెన్. ట్రంప్ తీసుకొచ్చిన దారుణ, క్రూరమైన నిబంధనల్లో సమగ్ర మార్పులు చేస్తానని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ చేసిన పనులను మార్చాలంటే మాత్రం నెలల సమయం గడిచిపోతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- బైడెన్ ప్రమాణ స్వీకారానికి 6వేల అదనపు బలగాలు