ETV Bharat / international

గ్రీన్​కార్డులు, వీసాలపై బైడెన్ పార్టీ కీలక హామీలు - డొనాల్డ్​ ట్రంప్​

ట్రంప్​ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలే లక్ష్యంగా డెమొక్రాటిక్​ పార్టీ తన మేనిఫెస్టోను రూపొందించింది. తాము అధికారంలోకి వస్తే.. గ్రీన్​కార్డులను నిలిపివేస్తూ ట్రంప్​ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని, హెచ్​-1బీ వీసాలపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తామని పేర్కొంది. ఈ మేరకు డెమొక్రాటిక్​ పార్టీ తన ప్లాట్​ఫార్మ్​లో వెల్లడించింది.

Will end the freeze on green cards, oppose suspension of H-1B visas: proposed Democratic Party Platform
గ్రీన్​కార్డ్ పునరుద్దరణకు డెమొక్రాటిక్​ పార్టీ హామీ
author img

By

Published : Aug 5, 2020, 9:35 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార రిపబ్లికన్​- ప్రతిపక్ష డెమొక్రాటిక్​ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. పై చేయి సాధించడానికి ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధానాలపై తన బాణాలను ఎక్కుపెట్టింది డెమొక్రాటిక్​ పార్టీ. తాము అధికారంలోకి వస్తే గ్రీన్​ కార్డుల జారీని పునరుద్ధరిస్తామని హామీనిచ్చింది. ఈ మేరకు ప్రతిపాదిత డెమొక్రాటిక్​ పార్టీ ప్లాట్​ఫార్మ్​-2020లో వెల్లడించింది.

హెచ్​-1బీ వీసాలను తాత్కాలికంగా నిలిపివేయాలన్న ట్రంప్​ ఆదేశాలను కూడా ఈ ప్లాట్​ఫార్మ్​ తప్పుబట్టింది. తాము అధికారంలోకి వస్తే నిషేధాన్ని ఉపసంహరించుకుంటామని స్పష్టం చేసింది.

"శాశ్వత, ఉద్యోగం ఆధారంగా ఇమ్మిగ్రేషన్​ వీసాలు అందించడానికి మేము మద్దతిస్తాం. మార్కెట్​ అవసరాలకు తగ్గట్టుగా ఈ వీసాలను అందివ్వాలి. ప్రతిభను ఆకర్షించి దేశంలో ఉంచుకోవాలని మేము భావిస్తాం. అందుకే శాశ్వత నివాసాల కోసం విదేశీయులకు అందించే గ్రీన్​కార్డుపై ట్రంప్​ యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి డెమొక్రాట్లు స్వస్తిపలుకుతారు. అదే విధంగా విదేశీ ఉద్యోగలకు ఇచ్చే హెచ్​-1బీ వీసాపై ట్రంప్​ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కూడా తొలగిస్తాం."

--- 2020 డెమొక్రాటిక్​ పార్టీ ప్లాట్​ఫార్మ్​

ఈ డెమొక్రాటిక్​ పార్టీ ప్లాట్​ఫార్మ్​.. భారత ఎన్నికల్లోని మేనిఫెస్టోతో సమానం. ఆగస్టు 17-20వరకు జరగనున్న సమావేశంలో డెమొక్రాట్లు దీనిని ఆమోదించనున్నారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.