ETV Bharat / international

కరోనా లింగ భేదం గుట్టు వీడిందోచ్‌!

author img

By

Published : Aug 27, 2020, 9:37 AM IST

కరోనా బారిన పడిన తర్వాత పురుషులతో పోలిస్తే మహిళల్లో రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా స్పందిస్తున్నట్లు వెల్లడించారు అమెరికా శాస్త్రవేత్తలు. స్త్రీలలోనే అధికంగా టీ కణాలు విడుదలవుతున్నట్లు తెలిపారు. వైరస్ బాధితుల్లో ఎక్కువగా పురుషులే అస్వస్థతకు గురవ్వటం వెనుక ఉన్న రహస్యం కనిపెట్టే భాగంలోనే ఈ విషయాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.

Why Covid-19 is different for men and women
కరోనా లింగ భేదం గుట్టు వీడిందోచ్‌!

కరోనా బాధితుల్లో మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా అస్వస్థతకు గురవుతుండటం వెనుక దాగి ఉన్న గుట్టును శాస్త్రవేత్తలు ఛేదించారు. వైరస్‌ బారిన పడ్డ తర్వాత పురుషులతో పోలిస్తే మహిళల్లో రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా స్పందిస్తుండటమే ఇందుకు కారణమని తేల్చారు.

కరోనా మహమ్మారి లింగ భేదాన్ని చూపుతున్నట్లు పలు అధ్యయనాలు ఇప్పటికే గుర్తించాయి. అయితే- అందుకు కారణమేంటన్నది మాత్రం ఇన్నాళ్లూ బయటపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని యేల్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం.. 18 ఏళ్లకు పైబడిన 98 మంది కరోనా బాధితులపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించింది. సాధారణంగా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకర కణాలను అంతమొందించడంలో రోగ నిరోధక వ్యవస్థలోని టి-కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. వైరస్‌ సోకిన తర్వాత పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ కణాలు అధికంగా విడుదలవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.

ఇదీ చూడండి:మాస్కు ధరించకపోతే నో ఎంట్రీ అంటున్న 'జఫిరా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.