ETV Bharat / international

కొవిడ్ మూలాలు ఇంకా తేలలేదు: డబ్ల్యూహెచ్​ఓ - వైరస్​ మూలాలపై డబ్ల్యూహెచ్​వో నివేదిక

కరోనా పుట్టుపూర్వోత్తరాలపై చైనా వెళ్లిన డబ్ల్యూహెచ్​ఓ బృందం ఎలాంటి ఆధారాలను కనుగొనలేదు. వైరస్​ ఎక్కడి నుంచి వ్యాపించిందో తెలుసుకోవాలంటే మరిన్ని పరిశోధనలు అవసరమని అభిప్రాయపడింది. వైరస్​ మూలాలను కనుగొనడానికి, వైరస్​ మొదట వెలుగుచూసిన వుహాన్​ నగరాన్ని పర్యటించిన డబ్ల్యూహెచ్​వో బృందం.. తన నివేదికను మంగళవారం వెల్లడించింది.

not yet found source of coronavirus
వైరస్​ మూలాలపై డబ్ల్యూహెచ్​వో నివేదిక
author img

By

Published : Mar 31, 2021, 5:28 AM IST

కరోనా వైరస్ మూలాలను ఇంకా ఇతమిత్థంగా గుర్తించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో) నిపుణుల బృందం పేర్కొంది. ఈ అంశంపై ఉత్పన్నమైన అనేక ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి తదుపరి అధ్యయనాలు అవసరమని తెలిపింది. కరోనా మూలాలను గుర్తించేందుకు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 10 మధ్య చైనాలోని వుహాన్ నగరంలో పర్యటించిన అంతర్జాతీయ బృందం మంగళవారం తన నివేదికను ప్రచురించింది. ఇందులో అంశాలను ప్రస్తావిస్తూ డబ్ల్యూహెచ్​వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్​ అథనోమ్​ ఒక ప్రకటన విడుదల చేశారు.

"డబ్ల్యూహెచ్​వోకు సంబంధించినంత వరకూ అన్ని సూత్రీకరణలూ పరిశీలనలో ఉన్నాయి. ఈ నివేదిక చాలా ముఖ్యమైన ప్రారంభం. అయితే ఇది ముగింపు కాదు. వైరస్ మూలాలను మేం ఇంకా గుర్తించలేదు. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు కొనసాగుతాయి. వుహాన్​లోని వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ వైరస్ లీకై ఉండటానికి ఆస్కారం చాలా తక్కువగా ఉందని నిపుణుల బృందం అభిప్రాయపడిందని, అయితే దీని పైనా మరింత పరిశోధన అవసరం ఉంది. కరోనా మూలాలను గుర్తించడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది తేలితే మరోసారి ఇలాంటి మహమ్మారులు పునరావృతం కాకుండా ఉమ్మడిగా చర్యలు చేపట్టవచ్చు. అందువల్ల ఒక పరిశోధక బృందం సాగించిన పర్యటనతో అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనడం కష్టం"

-డబ్ల్యూహెచ్​వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్​ అథనోమ్​

2019 డిసెంబరులోనూ, అంతకుముందూ వెలుగులోకి రాని రీతిలో కరోనా వ్యాప్తి జరిగి ఉంటుందని సూచించే డేటా పై నిపుణులు సమీక్ష జరిపారని టెడ్రోస్​ వివరించారు.

ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్న పాక్​ ప్రధాని

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.