అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన.. జో బైడెన్, కమలా హారిస్ను అభినందించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కొవిడ్-19ను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు పరస్పరం సాయం చేసుకుంటూ, నమ్మకంతో ఉండాలన్నారు.
కొవిడ్ విషయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించి, ఆరోగ్య సంస్థకు నిధులివ్వమంటూ ట్రంప్ ప్రభుత్వం ఇటీవలే హెచ్చరించింది. ఈ విషయాన్ని గుర్తుచేసిన టెడ్రోస్.. తమ సంస్థకు నిధులిచ్చే నూతన మార్గాలను ఆలోచించమని ప్రపంచ దేశాలను కోరారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, పరస్పరం సహాయం చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్న డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ వర్చువల్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్పై ఫైజర్ కీలక ప్రకటన