కరోనా వైరస్ పుట్టుకపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి కీలక ప్రకటన చేసింది. ఈ మహమ్మారి సహజంగాసిద్ధంగానే ఉద్భవించినట్లు పునరుద్ఘాటించింది. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టిందన్న ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ స్పష్టతనిచ్చింది.
ఆవాసం కోసం ప్రయత్నాలు..
కరోనా ఎలాంటి జీవుల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందో గుర్తించేందుకు ప్రస్తుతం కృషి చేస్తున్నట్లు డబ్ల్యుహెచ్ఓ వెల్లడించింది. వైరస్ ఆవాసాన్ని గుర్తించడం ద్వారా భవిష్యత్‌లో వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
చైనాలోని సముద్ర జీవుల మాంసం మార్కెట్ లేదా వుహాన్ ల్యాబ్లో వైరస్ వెలుగుచూసిందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నా.. ఇంకా శాస్త్రీయంగా నిర్ధరణ కాలేదు.