Russia invade Ukraine: ఉక్రెయిన్‌లోని తమ ప్రజలంతా తక్షణమే స్వదేశం తిరిగి రావాలని అమెరికా సూచించింది. ఎక్కువ సమయం లేదని, వీలైనంత త్వరగా బయల్దేరాలని పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా ఈ వారంలోనే దండయాత్ర చేస్తుందని తమకు స్పష్టమైన సమాచారం అందిందని తెలిపింది. ఈ వారంలో, లేదా 48 గంటల్లోనే రష్యా సైన్యం ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ వెల్లడించారు. చైనాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ ముగిసేలోపు దాడి జరగొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
Russia Ukraine War
దందయాత్ర చేయాలని రష్యా సైన్యానికి పుతిన్ ఆదేశాలు జారీ చేశారని తాము చెప్పడం లేదని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే అదే జరిగే సూచనలు కన్పిస్తున్నాయి అమెరికా పేర్కొంది. నిఘా వర్గాలు ఈ మేరకు తెలిపాయని వివరించింది.
రాయబార కార్యాలయం ఖాళీ..
జాతీయ భద్రతా సలహాదారు సూచనతో ఉక్రెయిన్ రాజధాని కియివ్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు అమెరికా అధికారులు. రష్యా ఏ క్షణమైనా దండయాత్ర చేసే అవకాశమున్నందున.. మరో 3000 బలగాలను పోలండ్‌కు పంపాలని అమెరికా రక్షణమంత్రి ఆదేశించిన కాసేపటికే ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా బలగాలతో కలిపి తూర్పు ఐరోపాలో అమెరికా బలగాల సంఖ్య 6వేలకు చేరనుంది. జో బైడెన్ సూచన మేరకే అదనపు బలగాలను పంపినట్లు అమెరికా రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు బ్రిటన్ రక్షణమంత్రి మాస్కోను సందర్శించారు. యుద్ధం జరగకుండా ఆపేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ట్రక్కుల ఆందోళన ఉద్ధృతం.. అమెరికా-కెనడా సరిహద్దు దిగ్బంధం