ETV Bharat / international

'దశాబ్దాలు గడుస్తున్నా చైనా దోపిడీలో మార్పుల్లేవు' - us china report news

కరోనా వ్యాప్తిపై ప్రపంచానికి సరైన సమాచారం ఇవ్వలేదని చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా.. ఇప్పడు విమర్శలను తీవ్రతరం చేసింది. దశాబ్దాలు గడుస్తున్నా చైనా దోపిడీ ఆర్థిక విధానాలు, తప్పుడు సమాచార వ్యాప్తి, మానవ హక్కుల ఉల్లంఘనలో ఎలాంటి మార్పులు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

white-house-report-blasts-chinese-malign-activities
'దశాబ్దాలు గడుస్తున్నా చైనా దోపిడీ విధానాల్లో మార్పుల్లేవు'
author img

By

Published : May 21, 2020, 11:42 AM IST

Updated : May 21, 2020, 12:09 PM IST

కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశం అమెరికా. ఈ పరిస్థితికి చైనానే కారణమని ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది అగ్రరాజ్యం. ఇప్పుడు విమర్శల జోరు పెంచింది. చైనా దోపీడీ ఆర్థిక విధానాలు అవలంబిస్తోందని, తప్పుడు సమాచార వ్యాప్తి, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని మండిపడింది. ఇందుకు సంబంధించి చైనా పరిపాలనపై 20 పేజీల నివేదికను రూపొందించింది అమెరికా.

ఈ నివేదికను బహిరంగంగా చర్చించడానికి వీల్లేదని.. పేరు చెప్పడానికి ఇష్టపడని శ్వేతసౌధం అధికారి ఒకరు అందులోని కీలక అంశాలను వెల్లడించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిపై దృష్టి పెట్టిన మీడియా.. చైనా మన ముందు ఉంచిన సవాల్​ను గుర్తించలేకపోతోందని నివేదిక విడుదలకు కొన్ని గంటల ముందు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో అన్నారు.

1949 నుంచి చైనా క్రూరమైన పాలనలో ఉందని.. వాణిజ్యం, శాస్త్రీయ సమాచార బదిలీ, దౌత్యపరమైన సంబంధాలు, ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందుతున్న దేశంలా ఉండటం వంటి విషయాల్లో అమెరికా లాగే చైనా ఉంటుందని భావించినప్పటికీ.. అలా జరగడం లేదని నివేదిక పేర్కొంది. సైద్ధాంతికపరంగా, రాజకీయ పరంగా స్వేఛ్చాయుత దేశాలకు చైనా శత్రువని అభిప్రాయపడింది.

తైవానీస్ మిలిటరీకి అధునాతన టార్పెడోల అమ్మకాన్ని ఆమోదించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారీ బరువు గల టార్పెడోలు, విడి భాగాలు, టెస్టింగ్​ పరికరాల్ని 180 మిలియన్ డాలర్లకు విక్రయించే విషయాన్ని కాంగ్రెస్‌కు తెలియజేసినట్లు పేర్కొంది. ఇది తైవాన్ భద్రతను మెరుగుపరిచి, రాజకీయ స్థిరత్వం, సైనిక సమతుల్యత, ఆర్థిక పురోగతిని కొనసాగించేందుకు సహాయపడుతుందని అభిప్రాయపడింది.

గత 20 ఏళ్లలో తన మార్కెట్లను విస్తృతంగా తెరిచి చైనాలో ఎక్కువ పెట్టుబడుల పెట్టడం, సాంకేతిక పరిజ్ఞానం అందించడం, సైనిక అధికారులకు శిక్షణ ఇవ్వడం సరళీకరణకు కారణమవుతుందని అమెరికా భావించినట్లు అధికారి వెల్లడించారు. 1989లో టియానన్మెన్ స్క్వేర్లో బీజింగ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులను దారుణంగా హతమార్చినప్పటి నుంచి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా తన రాజకీయ ఆలోచనలను నొక్కి చెబుతోందని వివరించారు.

అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సోన్​ హయాంలో చైనాతో దౌత్యపరమైన సంబంధాలు ప్రారంభమయ్యాని శ్వేతసౌధం అధికారి పేర్కొన్నారు. 40 సంవత్సరాల తరువాత చైనాలో ఆర్థిక, రాజకీయ సంస్కరణల పరిధిని పరిమితం చేయాలన్న చైనా కమ్యూనిస్ట్ పార్టీ సంకల్పాన్ని తక్కువ అంచనా వేసినట్లు స్పష్టమైందని నివేదిక తెలిపింది. గత రెండు దశాబ్దాల కాలంలో సంస్కరణలు నెమ్మదించడమో, ఆగిపోవడమో జరిగినట్లు వెల్లడించింది.. దౌత్య సంబంధాలు నిరుపయోగమని తెలిసినప్పుడు ప్రజల నుంచి చైనాపై ఒత్తిడి తీసుకురావాలనుకుంటోంది అమెరికా.

ఒబామా హయాం నుంచి..

సైనిక నిర్మాణం, సైబర్ హ్యాకింగ్​, ఆర్ధిక విధానాల్లో మార్పులకు సంబంధించి చైనా ఎన్ని హామీలు ఇచ్చినా పాటించడం లేదని నివేదిక స్పష్టం చేసింది. స్వలాభం కోసం వాణిజ్య రహస్యాలు, ప్రభుత్వం నిర్దేశించిన సైబర్ దాడులు ఆపుతామని ఒబామా హయాయంలో చైనా వాగ్దానం చేసిందని, ట్రంప్ మొదటి రెండేళ్ల పరిపాలనలోనూ ఇదే వాగ్దానాన్ని పునరుద్ధరించిందని నివేదిక వెల్లడించింది. 2018లో అమెరికా సహా 10కిపైగా దేశాలు.. చైనా హ్యాకింగ్​కు పాల్పడుతోందని మేధో సంపత్తి, వ్యాపార సమాచారాన్ని దొంగిలిస్తోందని ఆరోపించినట్టు గుర్తు చేసింది.

1980 తర్వాత మేధో సంపత్తిని రక్షిస్తామని పలు అంతర్జాతీయ ఒప్పందాలపై చైనా సంతకం చేసినప్పటికీ, ప్రపంచంలోని నకిలీలలో 63 శాతానికి పైగా ఆ దేశంలోనే ఉద్భవించాయని నివేదిక తెలిపింది. ఇది.. చట్టబద్ధమైన వ్యాపారాలపై వందల బిలియన్ డాలర్ల నష్టాన్ని కలిగిస్తోందని తేల్చింది.

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ పాలనలో అధికారులు రాజకీయ వ్యతిరేకతను అణచివేశారని, బ్లాగర్లు, కార్యకర్తలు, న్యాయవాదులపై అన్యాయంగా విచారణ జరిగిందని నివేదిక బహిర్గతం చేసింది. మీడియాను మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయాలు, వ్యాపారాలు ప్రభుత్వేతర సంస్థలపై కఠిన ఆంక్షలు విధించారని, అసమ్మతివాదులుగా భావించిన వ్యక్తులను ఏకపక్షంగా నిర్బంధించి హింసిస్తున్నారని నివేదిక చెప్పింది.

Last Updated : May 21, 2020, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.