అమెరికాలో మాస్క్‌లను ధరించటం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయాలన్న నిర్ణయాన్ని మరోసారి వ్యతిరేకించింది శ్వేతసౌధం.
"కచ్చితంగా మాస్క్‌లు ధరించాలన్న దానిపై ఆదేశాలు ఇవ్వలేం. మేము ఆయా స్థానిక గవర్నర్‌లు, మేయర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తాం". - మార్క్ మెడోస్, శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్
కరోనా కట్టడి, మాస్క్‌ల వినియోగంపై శ్వేతసౌధం తీసుకునే నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు న్యూజెర్సి డెమోక్రటిక్ గవర్నర్ ముర్ఫీ అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి వల్ల వైరస్ మరింత ఉద్ధృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా మాస్క్‌ల తప్పనిసరిపై ఆదేశం ఇచ్చే నిర్ణయాన్ని తిరస్కరించారు.
ఇదీ చూడండి:ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా