అమెరికాలోని శ్వేతసౌధంలో కరోనా కలకలం రేపింది. తనకు కొవిడ్ పాజిటివ్ అని తేలినట్టు పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్ సాకి వెల్లడించారు. శ్వేతసౌధంలోని సిబ్బంది ద్వారా తనకు వైరస్ సోకినట్లు సాకి తెలిపారు. గతవారంలో చివర సారిగా అధ్యక్షుడు జో బైడెన్‌ను మంగళవారం కలిసినట్టు సాకి వెల్లడించారు.
సాకి కూడా బైడెన్‌తో పాటు ఐరోపా పర్యటనకు రావాల్సి ఉండగా.. ఆమె వద్ద పనిచేస్తున్న సిబ్బందికి కరోనా సోకిందని తెలిసి ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
"సిబ్బందికి కరోనా సోకిందని తెలిసి బుధవారం నుంచి క్వారంటైన్లో ఉన్నాను. నాలుగు రోజుల పాటు నాకు నెగెటివ్ వచ్చింది. కానీ ఇప్పుడు చేసుకున్న పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. అధ్యక్షుడు బైడెన్‌తో కానీ, ఇతర ముఖ్య అధికారులతో కానీ ఎక్కువగా కలవలేదు."
-జెన్ సాకి, శ్వేతసౌధం పత్రికా వ్యవహారాల కార్యదర్శి
తాను పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నానని.. వైరస్‌కు సంబంధించి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు సాకి వెల్లడించారు. పది రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని.. పరీక్షల్లో నెగటివ్ వచ్చాకే తిరిగి విధులకు హాజరవుతానని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : COP26 glasgow: సౌరశక్తి బదిలీ కోసం భారత్- యూకే ఒప్పందం!