అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కల్పించి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మహిళా సమానత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు శ్వేతసౌధాన్ని ఊదా, బంగారు రంగులతో అలంకరించారు.
మహిళా సమానత్వ దినోత్సవం కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా వారం రోజులుగా అక్కడి బెల్మాంట్- పాల్ నేషనల్ ఉమెన్స్ పార్టీ ప్రధాన కార్యాలయం అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
శ్వేత సౌధం సహా.. కెన్నడీ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, స్మితోనియన్ మ్యూజియం వంటి చారిత్రక కట్టడాలను కూడా సుందరంగా తీర్చిదిద్దారు.
ఇదీ చదవండి: ఒక్క వారంలో నిరుద్యోగ భృతికి 10లక్షల దరఖాస్తులు